సీనియర్ జర్నలిస్ట్ హనుమంత్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలపాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియనిస్ట్ గా మారి మహబూబ్ నగర్ జిల్లాలో పోరాటం చేసిన హనుమంత్ రెడ్డి అకాల మరణం చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. హనుమంత్ రెడ్డి కుటుంబానికి మీడియా అకాడమీ తరపున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.