శిల్పారామం: “నాట్య అనిశం” – ది మేల్ డాన్స్ ఫెస్టివల్ లో అలరించిన పురుష నృత్యకళాకారుల ప్రదర్శనలు
శిల్పారామం మరియు ఇంటర్నేషనల్ డాన్స్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, కూచిపూడి సంయుక్తంగా నిర్వహించు “నాట్య అనిశం” – ది మేల్ డాన్స్ ఫెస్టివల్ సందర్భంగా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాలకు చెందిన పురుష నృత్యకళాకారులు విచ్చేసి ప్రదర్శించినారు.
శ్రీ దేవ్ శాస్త్రి, శ్రీ కళాకృష్ణ, శ్రీ వెంపటి రవిశంకర్, ప్రొఫెసర్ జొన్నలగడ్డ అనురాధ, శ్రీ వెంపటి సత్యప్రసాద్ గార్లు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి నృత్య ఉత్సవాన్ని ప్రారంభించినారు.
శ్రీ పసుమర్తి కుమారదత్త, శ్రీ రామ కౌండిన్య, శ్రీ పూజారి బాలచందర్, శ్రీ గురురాజ్, శ్రీ గంగాధర్, శ్రీ అమర్ నాథ్ ఘోష్ లు కూచిపూడి నృత్యాంశాలు గజవదనా బేడువే, కదిరి నరసింహుడు, దుర్గాతరంగం, రామాయణ శబ్దం, సంధ్య తాండవం, శివాష్టకం, అష్టపది, నందకధార నందగోపాల కీర్తనలు ప్రదర్శించారు.
ఇటీవల ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ అవార్డు గ్రహీత శ్రీ పసుమర్తి మృత్యుంజయ శర్మ గారిని ఐడిఆర్టిసి డైరెక్టరు గారు ఘనంగా సత్కరించారు. కళాకారులు మరియు గురువులందరినీ సత్కరించారు.