శిల్పారామంలో హస్తకళాకారులకు ” హస్త కళాకృతుల ప్యాకేజింగ్ విధానము” పై కార్యక్రమాలు
శిల్పారామంలో హస్తకళాకారులకు “హస్త కళాకృతుల ఎగుమతి విధానము” పై భారత ప్రభుత్వ హస్త కళల అభివృద్ధి కమీషనర్ వారి ఆర్థిక సహాయముతో తేదీ 10 నుంచి 11 ఆగస్టు 2017, (రెండు రోజులు) కార్యశాల నిర్వహించబడినది.
ఈ కార్యక్రమమును 08.08.2017 వ తేదీన శ్రీ జి. కిషన్ రావు గారు, స్పెషల్ ఆఫీసర్, శిల్పారామం గారు ప్రారంభించినారు. ఈ కార్యశాలలో 20 మంది హస్త కళాకారులు పాల్గొన్నారు.
శ్రీ వి.వి. సూర్యనారాయణ గారు (విశ్రాంత) హస్తకళల డైరెక్టరు, హస్తకళాకారులకు ఎగుమతి విధానం యొక్క ఆవశ్యకతను, తద్వా
రా వినియోగదారులకు ఆకర్షణీయంగా ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా విక్రయించుట వలన తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంపై అవగాహన కల్పించినారు.
మరియు హస్త కళాకృతుల అవగాహన కార్యశాల తేదీ 9 నుంచి 11 ఆగస్టు 2017, (3 రోజులు) 8 నుంచి 10 వ తరగతి చదువుతున్న 60 మంది స్కూల్ విద్యార్థులకు నిర్వహించబడినది.
వివిధ కళాకృతులపై అనుభవజ్ఞులైన కళాకారులచే కార్యశాల డెమో నిర్వహించబడినది.
శ్రీమతి యశస్వి గారు డిజైనర్, వివిధ కళాకృతులకు అనుగుణముగా తగిన విధానాలను వివిధ అవగాహన మెటీరియల్ మాధ్యమాలతో చూపించి చేయించారు.