మన తెలంగాణ – మన చరిత్ర పుస్తకాలను పంపిణి
రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ కే.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు తెలంగాణ చరిత్రను ప్రతి కుటుంబానికి తెలిపేందుకు మన తెలంగాణ – మన చరిత్ర పుస్తకాలను పంపిణి చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారుడు కే.వి.రమణాచారి తెలిపారు.
అరచేతిలో ఇమిడే ఈ పుస్తకాలను ఉగాది పర్వదినం మార్చి 18 నుంచి పంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. సచివాలయంలో బుధవారం సి.ఎం.కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.