తెలంగాణ అవతరణ ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న “అవతరణ ఫిల్మోత్సవం” పెళ్ళిచూపులు సినిమా దర్శకులు తరుణ్ భాస్కర్ దాస్యం పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తరుణ్ భాస్కర్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ తాను తీసిన షార్ట్ ఫిల్మ్ సైన్మ ప్రదర్శనకి నాకు తొలి అవకాశాన్ని అందించింది సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ .అలాగే మిత్రుడు నరేందర్ అని గుర్తు చేశారు. నాకు సినిమా గురించి హరికృష్ణ గారు ప్రోత్సాహాన్ని అందించారు అని, రాష్ట్రపతి నుంచి పురస్కారం తీసుకుంటూ ఉంటే నాకు మొదటగా వరంగల్, మన తెలంగాణ గుర్తు వచ్చింది అని అన్నారు. కార్యక్రమంలో మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తరుణ్ భాస్కర్ ఒక యంగ్ తరంగ్ కి కొత్త ఒరవడి అని, న్యూ వే అని తెలంగాణ అంటే జానపద కళల ఖజానా అని, తెలంగాణ భాష, సంస్కృతి, సాంప్రదాయాలను ఢిల్లీ దాకా తీసుకెళ్లారని, వారు ఈరోజు అవతరణ ఫిల్మోత్సవానికి రావటం సంతోషమని, యంగ్ తరంగ్ వారందరికి ఒక ఆదర్శం, ఇన్స్పిరేషన్ అని తెలిపారు.
తెలంగాణ పాట సంగీత దర్శకుడు నందన్ బొబ్బిలి, మైక్ టివి CEO సతీష్, రోషం బాలు, నరేందర్ గౌడ్ , అక్షర కుమార్, సంఘీర్, బత్తిని వినయ్ కుమార్, తదీతరులు పాల్గొన్నారు.