పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలి: ఎంపీ కవిత
హైదరాబాద్ జూన్ 18: పసుపు పంటపై బేగంపేటలో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో స్పైస్ బోర్డు ఆఫ్ ఇండియా ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ… పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని 3 దశాబ్దాల నుంచి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 1990లో 7 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడు 3 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిపోయింది. సోనాలిక పసుపు వంగడంకు బాగా డిమాండ్ ఉందన్నారు. తెలంగాణలో ఇతర పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో స్పైస్ బోర్డును ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు.