నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన స్టాండింగ్ కమిటి సమావేశంలో 27 తీర్మాణాలకు ఆమోదం
హైదరాబాద్ నవంబర్ 16 : నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన నేడు స్థాయి సంఘం సమావేశం జరిగింది. జిహెచ్ఎంసి కమీషనర్ బి.జనార్దనరెడ్డి కూడా హాజరైన ఈ సమావేశంలో 27 తీర్మాణాలకు ఆమోదం తెలిపారు. రూ. 1౩,150 కోట్ల అంచనా వ్యయం తో కూడిన బడ్జెట్ ప్రతిపాదనలను అధికారులు ప్రవేశ పెట్టారు. ఈ స్థాయి సంఘం సమావేశానికి 15మంది సభ్యులకుగాను 14మంది హాజరయ్యారు. హాజరైన సభ్యుల్లో వి.శ్రీనివాస్‌రెడ్డి, ఇ.ఎస్.రాజ్, పరమేశ్వరిసింగ్, సామ స్వప్న, కొప్పుల విఠల్‌రెడ్డి, ఎం.నర్సింహ్మాయాదవ్, ఎం.రాజేందర్‌యాదవ్, ఫరాబిన్ అబ్దుల్ సమ్మద్ బిన్ అబ్దత్, జగదీశ్వర్, బంగారు ప్రకాష్, మహ్మద్ ముజాఫర్ హుస్సేన్, మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఇఫెంది, మహ్మద్ మాజీద్ హుస్సేన్, జితేందర్, విజయలక్ష్మి గద్వాల్లు హాజరయ్యారు. ఆయేషా జహాన్ రుబినా, గైర్హాజరు అయ్యారు.
*స్టాండింగ్ కమిటి ఆమోదించిన 27 తీర్మాణాలు*
*మాదాపూర్ నుంచి ఐలా రోడ్ ను 80 ఫీట్ల విస్తరణకు గానూ రూ. 6,41,40,000 లు పరిహారంగా చెల్లించేందుకు ఆమోదం.
*మాదాపూర్ నుంచి ఐలా రోడ్ ను 80 ఫీట్ల విస్తరణకు గానూ రూ. 2,70,00,000 లు పరిహారంగా చెల్లించేందుకు ఆమోదం.
*జిహెచ్ఎంసిలో పార్ట్ టైం కోచ్ లుగా పని చేస్తున్న 149 మంది కోచ్ ల గౌరవ వేతనాలను 75 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం.
*గ్రేటర్ హైదరాబాద్ లో 826 బస్ షెల్టర్లను బిఓటి పద్ధతిన నాలుగు ప్యాకేజీలలో 15 ఏళ్ళ పాటు అధిక మొత్తానికి బిడ్డింగ్ చేసిన సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వానికి పంపే ప్రతిపాదలకు ఆమోదం
*బహదూర్ పురాలో ప్రతిపాదిత మల్టీలెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి భూసేకరణకు గానూ రూ. 86,64,166 లు చెల్లించేందుకు ఆమోదం
*సిఎస్ఆర్ పద్ధతిలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ లలో అండర్ గ్రౌండ్ డస్ట్ బిన్ ల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం
*ముర్కీనాలా ఆధునీకరణలో భాగంగా రూ.3 కోట్లు కేటాయించే ప్రతిపాదనలకు ఆమోదం.
*ముర్కీనాలా ఆధునీకరణలో భాగంగా యాకత్ పురా రైల్వేస్టేషన్ వద్ద మిగిలిన పనులను రూ. 2. 50 కోట్లతో చేపట్ట్టడానికి ప్రతిపాదనలు ఆమోదం
*బేగంపేట సర్కిల్ లోని భన్సిలాల్ పేటలో కొత్తగా నిర్మించిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఉపయోగానికి రూ.20 వేలు రోజుకు అద్దేగా, రూ. 40వేలు డిపాజిట్ గా నిర్ణ యిస్తూ ప్రతిపాదనలకు ఆమోదం.
*ఎస్టేట్ విభాగంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ వై. వెంకటమురళి ని మరో మూడు నెలల పాటు కాంట్రాక్ట్ పద్ధతిని కొనసాగించే ప్రతిపాదనలకు ఆమోదం.
*నగరంలో మరో పన్నెండు ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణానికి ఫిజబులిటీ స్టడీ తయారీకి కనసల్టెన్సీ నియామకానికి ఆమోదం.
*కొత్తగూడా, కొండాపూర్ జంక్షన్లలో మల్గీ లెవెల్ ఫ్లై ఓవర్లు, గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ లైన్లు, అండర్ గ్రౌండ్ కేబుల్లు తొలగించేందుకు రూ.3.75 కోట్లను టిఎస్ఎస్ పిడిసిఎల్ కు డిపాజిట్ చేసేందుకు ప్రతిపాదనలు ఆమోదం
*షేక్ పేట 7ట్యూంబ్స్ సమీపంలో స్టార్మ వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.6కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం
*కార్వాన్ లోని మహబూబ్ కాలనీ నుంచి రుహీ హోటల్ మార్గంలో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ ను 6 కోట్లతో చేపట్టే ప్రతిపాదనలకు ఆమోదం
*జిహెచ్ఎంసి కి చెందిన ప్రధాన పార్కుల్లో ప్రవేశ రుసుమును ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు పెంచే ప్రతిపాదనలకు ఆమోదం.
*నగరంలో జంక్షన్ ఇంప్రూవ్ మెంట్ ప్రణాళిక అమలుకు రూ.100 కోట్ల రుణాన్ని టియూఎఫ్ఐడిసి నుంచి స్వీకరించే ప్రతిపాదనలకు ఆమోదం
*మూసాపేట మెట్రో రైల్వే స్టేషన్ ఎదురుగా వై జంక్షన్ కు అంబేద్కర్ జంక్షన్ గా నామకరణం చేసే ప్రతిపాదనలకు ఆమోదం
*కాజాగూడా చెరువు నుంచి ఓల్డ్ బాంబే హైవే మీదుగా ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీ వరకూ రహదారి అభివృద్ధి ప్రతిపాదనలకు ఆమోదం
*బహదుర్ పురా జంక్షన్ వద్ద మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి గానూ భూసేకరణ నిమిత్తం రూ.27,82,547లను చెల్లించేదుకు ఆమోదం
*శివరాంపల్లిలోని కాటేదాన్ నాలా విస్తరణకుకోల్పోయే ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు రూ. 1,57,45, 195లకు ఆమోదం
*హయత్ నగర్ డిగ్రీ కాలేజ్ సమీపంలోని వినాయకనగర్ లెక్చరర్స్ కాలనీ ఆదిత్యానగర్, సిఎస్ఆర్ కాలనీ, పవనగిరి తదితర కాలనీలలో సీవరేజ్ డ్రెయిన్లను మూడు కోట్లతో చేపట్టే ప్రతిపాదనలకు ఆమోదం
*జిహెచ్ఎంసి పరిధిలొని శ్మశాన వాటికల ఆధునీకరణకు నాలెడ్జ్ పార్టనర్ గా ఫినిక్స్ ఫౌండేషన్ ను నియమించే ప్రతిపాదనలకు ఆమోదం
*బండ్లగూడ నుంచి కింగ్స్ ఎవెన్యూ మార్గంలో ఉన్న ముర్కీనాలాపై రూ.2.98 కోట్ల వ్యయంతో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆమోదం
*నగర శివారు ప్రాంతాలలో సీవరేజీ నిర్వహణకు 66 మినీ జెట్టింగ్ మిషన్లను రూ.19.95 కోట్ల వార్షిక అద్దెతో మూడేళ్ళకు పైగా తీసుకోవాలన్న ప్రతిపాదనలకు ఆమోదం
*అత్యంత ఎమర్జెన్సీ పనులను నిర్ణయించిన యూనిట్ రేట్ ప్రాతిపదికపై రూ.5లక్షల వరకూ నామినేషన్ పై రిజిస్టర్ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు జోనల్ కమిషనర్లకు అధికారం ఇచ్చే ప్రతిపాదనలకు ఆమోదం
*మంగళహాట్ డివిజన్లోని చున్నీకా బస్తీలో రూ.3కోట్ల వ్యయంతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టే పనులకు ఆమోదం