దివికేగిన దివ్యతార.. శ్రీదేవి ఇక లేరు.. మూగబోయిన సినీ లోకం
హైదరాబాద్ ఫిబ్రవరి 25: దివికేగిన దివ్యతార.. శ్రీదేవి ఇక లేరు. దివి నుండి భువికి దిగివచ్చిన అతిలోకసుందరి శ్రీదేవి. ఆమె అందాన్ని వర్ణించడానికి పదాలు కూడా సరిపోవు. అందాల నటి ‘అతిలోక సుందరి’ శ్రీదేవి ఇక లేరు.
అందాల నటి శ్రీదేవి దుబాయ్‌లో శనివారం రాత్రి కన్నుమూశారు. ఆమె మరణ వార్త అభిమానుల మనసులని ఎంతగానో గాయపరిచింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ సినిమాల్లో నటించారు. శ్రీదేవి హఠాన్మరణంతో.. సినీ లోకం మూగబోయింది. ఆమె మృతిపట్ల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాలీవుడ్ నిర్మాత, హీరో అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్‌ను 1996లో శ్రీదేవి వివాహం చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు.. జాహ్నవి, ఖుషి.
1963, ఆగస్టు 13న శివకాశిలో జన్మించిన శ్రీదేవి.. 1967లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. హీరోయిన్గా శ్రీదేవి తొలి చిత్రాలు.. తెలుగులో పదహారేళ్ల వయసు, హిందీలో సోల్వా సావన్. 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన మాండ్రు ముడిచులో కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో కలిసి నటించి.. ఆవిడ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుని పలువురి ప్రశంసలు పొందారు. 1975-76 మధ్య కాలంలో తెలుగు, తమిళంలో ఆమె అగ్రస్థాన కథనాయిక స్థానానికి ఎదిగారు.
2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. చివరిసారిగా మామ్ చిత్రంలో నటించారమె.
తెలుగులో అగ్రనటులందరితోనూ నటించారు. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ సినిమాల్లో నటించి లక్షల సంఖ్యల్లో అభిమానులను సంపాదించుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులు ఆమెను వరించాయి. 2013లో శ్రీదేవిని పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. చాందిని, లమ్హే, మిస్టర్ ఇండియా, నాగిన వంటి బ్లాక్‌బ్లాస్టర్ సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందారు. కొండవీటి సింహం, క్షణక్షణం, వేటగాడు, సర్దార్ పాపరాయుడు, బొబ్బిలిపులి, ప్రేమాభిషేకం, జగదేకవీరుడు అతిలోకసుందరి, గోవిందా గోవిందా సినిమాల్లో శ్రీదేవి నటించారు. .
Contents
దివికేగిన దివ్యతార.. శ్రీదేవి ఇక లేరు.. మూగబోయిన సినీ లోకంహైదరాబాద్ ఫిబ్రవరి 25: దివికేగిన దివ్యతార.. శ్రీదేవి ఇక లేరు. దివి నుండి భువికి దిగివచ్చిన అతిలోకసుందరి శ్రీదేవి. ఆమె అందాన్ని వర్ణించడానికి పదాలు కూడా సరిపోవు. అందాల నటి ‘అతిలోక సుందరి’ శ్రీదేవి ఇక లేరు.అందాల నటి శ్రీదేవి దుబాయ్‌లో శనివారం రాత్రి కన్నుమూశారు. ఆమె మరణ వార్త అభిమానుల మనసులని ఎంతగానో గాయపరిచింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ సినిమాల్లో నటించారు. శ్రీదేవి హఠాన్మరణంతో.. సినీ లోకం మూగబోయింది. ఆమె మృతిపట్ల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాలీవుడ్ నిర్మాత, హీరో అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్‌ను 1996లో శ్రీదేవి వివాహం చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు.. జాహ్నవి, ఖుషి.1963, ఆగస్టు 13న శివకాశిలో జన్మించిన శ్రీదేవి.. 1967లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. హీరోయిన్గా శ్రీదేవి తొలి చిత్రాలు.. తెలుగులో పదహారేళ్ల వయసు, హిందీలో సోల్వా సావన్. 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన మాండ్రు ముడిచులో కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో కలిసి నటించి.. ఆవిడ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుని పలువురి ప్రశంసలు పొందారు. 1975-76 మధ్య కాలంలో తెలుగు, తమిళంలో ఆమె అగ్రస్థాన కథనాయిక స్థానానికి ఎదిగారు.2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. చివరిసారిగా మామ్ చిత్రంలో నటించారమె.తెలుగులో అగ్రనటులందరితోనూ నటించారు. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ సినిమాల్లో నటించి లక్షల సంఖ్యల్లో అభిమానులను సంపాదించుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులు ఆమెను వరించాయి. 2013లో శ్రీదేవిని పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. చాందిని, లమ్హే, మిస్టర్ ఇండియా, నాగిన వంటి బ్లాక్‌బ్లాస్టర్ సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందారు. కొండవీటి సింహం, క్షణక్షణం, వేటగాడు, సర్దార్ పాపరాయుడు, బొబ్బిలిపులి, ప్రేమాభిషేకం, జగదేకవీరుడు అతిలోకసుందరి, గోవిందా గోవిందా సినిమాల్లో శ్రీదేవి నటించారు. .