కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు
తెలంగాణ భాషా సాంస్కృతిక వెబ్ సైట్ ను మంత్రి చందులాల్ ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. కళాకారుల గుర్తింపు కార్డుల కోసం వెబ్ సైట్ రూపొందించినట్లు మంత్రి చందులాల్ చెప్పారు. వెబ్ సైట్ ఆధారంగా కళాకారులు గుర్తింపు కార్డును పొందవచ్చన్నారు. ఈ వెబ్ సైట్ లో కళాకారుల పూర్తి డీటెయిల్స్ ఉంటాయన్నారు. టూరిజం మంత్రి చందులాల్ చేతుల మీదుగా వెబ్ సైట్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు రమణాచారి.