ఇక నుండి ఫైర్ ఎన్.ఓ.సిలు ఆన్లైన్లో జారీ
హైదరాబాద్ ఆగష్టు 29(ఎక్స్ ప్రెస్ న్యూస్); జీహెచ్ఎంసీ ద్వారా అందించే సేవల్లో సులభతర పాలన విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భాగంగా మరింత మెరుగైన పౌర సేవలను అందించడానికి ఫైర్ సర్వీసుల ఎన్.ఓ.సిలను ఆన్లైన్ ద్వారా అందించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇప్పటికే పలు విభాగాల్లో ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ తాజాగా ఫైర్ సర్వీసుల నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్లను కూడా ఆన్లైన్ విధానంలోనే అందించాలని నిర్ణయించింది. ఈఓడిబిలో భాగంగా ఫైర్ ఎన్.ఓ.సిల జారీని దరఖాస్తు నుండి ఆమోదం వరకు ఆన్లైన్లోనే చేపట్టనున్నది. నేటి (ఆగష్టు 28వ తేదీ) నుండి ఈ విధానం అమల్లోకి వచ్చింది. జీహెచ్ఎంసీ వెబ్సైట్ అయిన www.ghmc.gov.in లోకి వెళ్లి ఫైర్ ఎన్.ఓ.సి ఆప్షన్ ద్వారా పాఠశాలలు, ఫంక్షన్‌హాళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థన స్థలాలు తదితర సంస్థలు ఎన్.ఓ.సికై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత పారదర్శకత, జవాబుదారితనం ఉండేందుకుగాను ఫైర్ ఎన్.ఓ.సిల జారీకి ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం వల్ల దరఖాస్తుదారుడు తమ ఫైల్ మూమెంట్‌కు సంబంధించి సమాచారం ఎస్.ఎం.ఎస్ ద్వారా కూడా అందజేయనున్నాము. 15మీటర్ల ఎత్తులో గల భవనాలకు జీహెచ్ఎంసీ ఫైర్ ఫ్రివెన్షన్ విభాగం ఎన్.ఓ.సి లను జారీచేసింది, సెల్లార్లతో సహా మొత్తం భవనం వైశాల్యానికి చదరపు మీటరుకు పది రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉంటే ఆన్లైన్ ద్వారా ఏడు రోజుల్లోనే ఫైర్ ఎన్.ఓ.సిలను జారీచేస్తారు. ఏవైనా డాక్యుమెంట్లు జత చేయనట్టైతే వాటి గూర్చిన సమాచారాన్ని ఎస్.ఎం.ఎస్ ద్వారా అందిస్తారు.