100 % కొలువులు భర్తీచేస్తాం..
టీఎస్పీఎస్సీ చైర్మన్ పనితీరు భేష్
ప్రతిపక్షాల నిర్మాణాత్మక సలహాలు స్వీకరిస్తాం
అడ్డగోలుగా మాట్లాడితే గౌరవం ఉండదు
అంబేద్కర్ ఓవర్సిస్ పథకానికి పరిమితి లేదు
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ముఖ్యమంత్రి వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న లక్షా 12 వేల ఉద్యోగాలు వంద శాతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, గ్రూప్-2 అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి ఎలాంటి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. బలహీనవర్గాలకోసం అనేక పథకాలు తీసుకొచ్చామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుందన్నారు.