Top Bar Ad

Breaking News

స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాలో ఐ బ్యాంకు ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ‌శాఖ మంత్రి డాక్టర్ సి ల‌క్ష్మారెడ్డి

స‌రోజ‌నీ కంటి ద‌వాఖానాలో ఐ బ్యాంకు ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ‌శాఖ మంత్రి డాక్టర్ సి ల‌క్ష్మారెడ్డి

రూ.కోటి విలువ చేసే అత్యాధునిక ప‌రిక‌రాలను ప్రారంభించిన మంత్రి

కొత్త ఎసీ పోస్టు ఆప‌రేటివ్ వార్డుని, నేత్రాల సేక‌ర‌ణ‌కు అంబులెన్స్‌ని ప్రారంభించిన మంత్రి

ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ నేత్రదానం మహా దానం. మనం చనిపోయాక కూడా మన నేత్రాలు మరొకరిలో బతికే ఉంటాయి అని అన్నారు. దక్షిణ భారత దేశంలో ప్రభుత్వ వైద్య రంగంలో మొట్టమొదటి ఐ బాంక్ ని సరోజని లో  ప్రారంభించుకున్నాం. ఇది గర్వించదగ్గ విషయం. అలాగే నేత్రాల సేకరణకు అంబులెన్స్ ఉండటం వల్ల ఎంతో ఉపయోగం. నేత్రాల సేకరణ వేగంగా చేయవచ్చు. గతంలో కార్నియా కలెక్షన్ చేసిన 24 గంటల్లోనే దాన్ని అవసరమైన వాళ్లకు అమర్చాల్సి వచ్చేది.  ఇప్పుడు రెండు నెలల వరకు నిలువ ఉంచే వీలు ఉంటుంది. అందరూ నేత్రదానం తో పాటు అవయవ దానం పై ప్రజల్లో అవగాహన పెంచాలి.  ప్రతి నిమిషానికి ఒక శిశువు కంటి చూపు కోల్పోతున్నది. నేత్రదానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళల్లో చిన్నారులు అధికం. మరణిస్తున్న వాళ్ళల్లో 2శాతం మంది నేత్ర దానం చేసినా, అంధత్వం నివారించవచ్చు అని మంత్రి అన్నారు.

ప్రభుత్వ పరంగా సర్కార్ దవాఖానా ల్లో అన్ని రకాల అభివృద్ధి చేపట్టాం. బీదలకు మెరుగైన, సమర్థమైన సేవలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. డియాలిసిస్, ఐసియు లు, పాలియేటివ్ కేర్, కాన్సర్ స్క్రినింగ్ సెంటర్స్,  ఫెర్టిలిటీ సెంటర్, తెలంగాణ డియాగ్నోస్టిక్స్, ఇంటింటికి కంటి పరీక్షలు, హెల్త్ ప్రొఫైల్ వంటి ఇన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాం.  రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తాం. ఇంకా ముందు ముందు సరోజనికి అవసరమైన సహాయం అందిస్తాం. సరోజనికి పేషంట్స్ అటెండెంట్స్ కి షెల్టర్ ఏర్పాటు చేస్తాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రముఖ పారిశ్రామిక వేత్తలు వైద్య రంగానికి సహాయంగా ఉండాలి.  కపడియా కుటుంబానికి కృతజ్ఞతలు. సరోజనికి వాళ్ల సేవలు అభినందనీయం అని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

అనంతరం మంత్రి సరోజని హాస్పిటల్ ని పరిశీలించారు.  పేషంట్స్ అటెండెంట్స్ షెల్టర్ కోసం స్థలాన్ని పరిశీలించారు. హాస్పిటల్ మొత్తం భూమి, ప్రస్తుతం ఉన్న కట్టడాలు, ఖాళీ స్థలాల మ్యాప్ ని సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ఈ ఈ ఫణికుమార్ ని మంత్రి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, కార్పొరేటర్ అయేషా రుబీనా బేగం, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ రాజలింగం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *