Top Bar Ad

Breaking News

స‌మ్మ‌క్క‌-సారక్క జాత‌ర‌కు మహారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్,ముఖ్య‌మంత్రిని ఆహ్వానించిన బిజెపి

స‌మ్మ‌క్క‌-సారక్క జాత‌ర‌కు మహారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్,ముఖ్య‌మంత్రిని ఆహ్వానించిన బిజెపి

హైదరాబాద్ జనవరి 8: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్ బృందం సోమ‌వారం మహారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్‌రావు, ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్నావీస్‌ను కలిసింది.

తెలంగాణ‌లో ఘ‌నంగా నిర్వ‌హించుకునే మేడారం స‌మ్మ‌క్క‌-సారక్క జాత‌ర‌కు రాష్ట్ర స‌రిహ‌ద్దు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌లు, సీఎం ల‌ను ఆహ్వానించడంలో భాగంగా డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్‌తో పాటు ఇత‌ర నేత‌లు మ‌హారాష్ట్ర వెళ్లారు.

మొద‌ట గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్‌రావును క‌లిసి తెలంగాణ‌లో గిరిజ‌నులు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే మేడారం జాత‌ర‌కు రావాల‌ని కోరారు. డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ బృందం ఆహ్వానంపై మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సానుకూల‌త వ్య‌క్తం చేశారు. త‌ప్ప‌కుండా మేడారం జాత‌ర‌కు హాజ‌ర‌వుతాన‌ని బృందంలోని నేత‌ల‌కు హామీ ఇచ్చారు.

 

అనంత‌రం డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ బృందం మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్నావీస్‌ను క‌లిసి అయ‌న్ను మేడారం స‌మ్మ‌క్క-సార‌ల‌మ్మ  జాత‌ర‌కు ఆహ్వానించారు. దీనిపై స్పందించిన ముఖ్య‌మంత్రి ఫ‌డ్నావీస్ త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని తెలిపారు.  గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన బృందంలో డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్‌తో పాటు డాక్ట‌ర్ రాజేశ్వ‌ర్‌రావు, ప్రేమేంద‌ర్‌రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే లింగ‌య్య దొర, ఎస్టీ మోర్చా జాతీయ కార్య‌ద‌ర్శి అమ‌ర్‌సింగ్ ప‌వార్‌, మాజీఎమ్మెల్యే ఒన్నాల శ్రీ‌రాములు, తదిత‌రులు ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *