Top Bar Ad

Breaking News

సిరిసిల్లలో మరమగ్గాల ఆధునికరణ మేళాను ప్రారంభించిన మంత్రి కేటిఆర్

సిరిసిల్లలో మరమగ్గాల ఆధునికరణ మేళాను ప్రారంభించిన మంత్రి కేటిఆర్

నేతన్నలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో మరమగ్గాల ఆధునీకరణ-ఇన్ సిటు అప్‌గ్రెడేషన్ మేళాను ఈ రోజు సిరిసిల్లలో మంత్రి శ్రీ కేటిఆర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50000 సాధారణ మగ్గాలు ఉండగా ఒక్క సిరిసిల్లలోనే 30000 మగ్గాలు ఉన్నాయి. పాత కాలపు మగ్గాలపైనే వస్త్ర ఉత్పత్తులు చేయడం వల్ల నాణ్యమైన వస్త్రం తయారీలేక మార్కెట్‌లో పోటీని తట్టుకోలేక వస్త్ర పరిశ్రమ నిలదొక్కుకోలేకపోతున్నది.

మగ్గాలను ఆధునికీకరించి నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంద శాతం సబ్సిడీతో మరమగ్గాలను ఆధునికీకరిస్తున్నాయి. ఈ ఆధునీకరణ ద్వారా వివిధ రకాలైన షర్టింగ్, షూటింగ్ తువ్వాల్లు, లుంగీలు మరియు అన్నిరకాల ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే వస్ర్తాల ఆర్డర్లను నేతన్నలకు ఇవ్వవచ్చు. ఇంకా బయటి మార్కెట్ లో అమ్మగలిగిన వస్త్రాలను తయారు చేయవచ్చు. దీని వల్ల ఆసామికి (యజమానికి) మరియు కార్మికునికి కూలి గిట్టుబాటు లభించి దాదాపు నెలకు రూ. 16,000 నుండి రూ. 20,000 పొందవచ్చు.

ఈ మగ్గాల ఆధునీకరణలో బాగంగా ఒక్కో మగ్గానికి 40000 నుండి 90000 వరకు ఖర్చు అవుతుండగా కేంద్రం 50 శాతం సబ్సిడీ ఇస్తుండగా నేతన్నల పై భారం పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిగతా 50 శాతాన్ని చెల్లిస్తుంది. ఒక్కో ఆసామి (యజమాని)గరిష్టంగా 8 మగ్గాల వరకు ఆధునికరించుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో 2399 లబ్దిదారులు 12797 మరమగ్గాల ఆధునీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా, ఒక్క సిరిసిల్లలోనే 1250 లబ్దిదారులు 8880 మరమగ్గాల ఆధునీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు . 15000 మరమగ్గాల ఆధునీకరణకు గాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కింద రూ.30 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.

23755468_2012679278943460_9092191231122505626_n 23794803_2012678898943498_3314036230330891137_n 23795264_2012679378943450_8296704179229433215_n 23795595_2012679462276775_510354470929840235_n 23843428_2012678775610177_8912015510891089245_n 23843462_2012679155610139_266564954553701219_n 23844705_2012679292276792_5694361480274295841_n 23844900_2012678858943502_7528820180887370964_n 23905709_2012679232276798_430766585978526159_n
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *