Top Bar Ad

Breaking News

సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ వార్షికోత్సవానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి

సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ వార్షికోత్సవానికి హాజరై ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి.

* 7 గోల్డ్ మెడల్స్ పొందిన స్వప్న అనే విద్యార్థినికి 10వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చిన  ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి.

* తెలంగాణ ప్రభుత్వం బాలిక విద్యను ప్రోత్సహిస్తుంది.

* వనితా మహా విద్యాలయ న్యాక్ “A” గ్రేడ్ పొందడాన్ని అభినందిస్తున్నాను.

* బాలికల విద్యను ప్రోత్సహించే ఇలాంటి మంచి కాలేజీలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం పై ఉంది.

* ఈ కాలేజి సమస్యలను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాను.

* కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎపుడూ చెబుతుంటారు.

* ఇందులో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. బంగారు తెలంగాణ సాధించే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగా విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తోంది.

* దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని గురుకులాలను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 296 గురుకులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక 470 గురుకులాలను ఏర్పాటు చేసుకోవడంతో ఇపుడు అవి 840కి చేరుకున్నవి.

* 12వ తరగతి తరవాత ఎస్సీ, ఎస్టీ బాలికలు విద్య మానేస్తున్నారని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ 53 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు.

* త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.

* యూనివర్సిటీ లను బలోపేతం చేసేందుకు 420 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారన్నారు.

*ఇటీవల అన్ని విద్యా సంస్థల్లో బాలికలు ముందంజలో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మెడికల్ కాలేజీల్లో గతంలో 80 శాతం అబ్బాయిలు, 20 శాతం అమ్మాయిలుంటే…ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని, 80 శాతం అమ్మాయిలు, 20 శాతం అబ్బాయిలుంటున్నారని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో 60 శాతం అమ్మాయిలు, 40 శాతం అబ్బాయిలుంటున్నారని తెలిపారు. అన్ని రకాల కోర్సుల్లో అమ్మాయిలే ఎక్కువగా ఎన్ రోల్ మెంట్ ఉంటుందన్నారు.

*తెలంగాణ ప్రభుత్వం బాలికా విద్యను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

* వార్షికోత్సవంలో భాగంగా అత్యధిక మార్కులు పొందిన బాలికలకు గోల్డ్ మెడల్స్, ప్రశంసాపత్రాలు అందించారు.

*ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ వసంతరావు, కార్యదర్శి నరోత్తమరెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ విజయశ్రీ, కాలేజీ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *