Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము, యాదగిరి గుట్ట – శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా ప్రారంభమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం, 05-March-17, DAY-7

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము, యాదగిరి గుట్ట – శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా ప్రారంభమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం, 05-March-17, DAY-7

శ్లో: శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే, భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే

యోగీశ శాశ్వత చరణ్య భవాబ్ది పోత, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్

యాదాద్రి నరసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా ప్రారంభమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం. పాల్గొన్న కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీతారెడ్డి, చైర్మన్ నర్సింహమూర్తి. భారీగా హాజరైన భక్తులు.

స్వస్తి శ్రీ దుర్ముఖి నామ సంవత్సర, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి సోమవారము తేదీ 27-02-2017 నుండి 09-03-2017 గురువారము ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా జరుగుచున్నవి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు తేది 05-03-2017 ఆదివారము రోజున శ్రీ స్వామి వారి బాలాలయములో నిత్యహవనములు, మూలమంత్రజపములు, హోమములు, పారాయణములు నిర్వహింపబడినవి.   అనంతరము “ప్రభాత భేరి” స్థానిక శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య వారిచే సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు బాలాలయములో భక్తులు స్థానికులు పాల్గొనగా చక్కగా నిర్వహింపబడినవి.

అనంతరము శ్రీ స్వామి వారిని “జగన్మోహినీ అలంకార సేవలో అలంకరించి పారాయణీకుల స్తోత్ర పఠనములతో ఉత్సవ సేవను ఆలయ అధికారులు, భక్తులు పాల్గొనగా ఎంతో వేడుకగా బాలాలయములో నిర్వహించిరి. ఈ వేడుకలో ఆలయ ఛైర్మన్ శ్రీ బి. నరసింహమూర్తి గారు, కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.గీత గారు, ఆలయ పేష్కార్, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొనిరి.

జగన్మోహినీ అలంకార సేవ విశిష్టత: బ్రహ్మోత్సవములలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అలంకారము శ్రీ జగన్మోహినీ అలంకారము. దేవదానవులు క్షీర సాగర మధనము గావించగా, ఆవిర్భవించిన అద్భుత కలశమును దానవులు అపహరించగా దేవతలు దిక్కుతోచని స్థితిలో ఉండగా శ్రీ మహా విష్ణువు ఒక అపూర్వమైన జగన్మోహనాకారమైన రూపమును ధరించి తన అపూర్వమైన హావ భావ చేష్టలతో సౌందర్య, విలాస చూపులతో, దానవుల వైపు వెళ్ళి, వారి రాక్షస ప్రవృత్తికి సమ్మోహనమును కలిగించి వారి వద్ద ఉన్న అమృత కలశమును చేబూని అందరికీ క్రమములో అందించగలనని మాయా మోహమును కల్పించి సత్వ రుణ ప్రధానములైన దేవతలకు ఈ అమృతమును అందించిన అపూర్వమైన తత్వమే ఈ జగన్మోహినీ అవతార రహస్యము. ఈ అలంకార సేవను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వరూపములో దర్శించిన అరిషడ్వర్గములు (కామ క్రోధాదులు) తొలగి అమృతమయమైన ఆనందమును పొందగలరని వేదాంతుల భక్తి తత్వము, ప్రకృతి మాయా స్వరూపిణి అని అసుర ప్రవృత్తి గల వారలు ఈ మాయకు లోనగుదురని, దానిని తొలగించే సామర్థ్యము పరమాత్మకే కలదు అని భక్తుల విశ్వాసము.

ఎదుర్కోలు విశిష్టత:-

బ్రహ్మోత్సవములలో నిర్వహింపబదు అన్ని వేడుకలు మహాదానందదాయకమే అత్యంత విశిష్టత కలిగిన ఈ ఎదుర్కోలు వేడుక భగవానుని, అమ్మవారి లోక రక్షణ తీరును వారిరువురి వైభావమును పేర్కొనుచూ తిరుకళ్యాణ మహోత్సవమునకు సంబంధించిన పూర్వరంగముగా వధూవరుల గోత్ర, ప్రవర, పరిచయాదులు గావించుకొని సుమూహూర్త నిర్ణయంలో ఈ వేడుక నిర్వహించబడుట ఆగమశాస్త్ర ప్రసిద్ధమైయున్నది. భగవానుడు సత్యజ్ఞాన స్వరూపుడని అనేక కళ్యాణ గుణములను పేర్కొనుచూ ఆ గుణ కోటి, జీవకోటికి ఉపయోగపడు రీతిలో వాత్సల్య, సౌశీల్య, సౌందర్య గుణములతో ప్రసన్నుని గావించుకొని రక్షింపచేయు పురుషాకార స్వరూపిణి అమ్మవారు అని వారిరువురిని స్థుతించే ప్రక్రియ ఎంతో ఆనందదాయకము.

ఉచిత వైధ్యశిభిరము : సాయి సంజీవిని హాస్పిటల్స్ బ్రహ్మోత్సవములకు విచ్చేయు భక్తులకు సాయిసంజీవిని హాస్పిటల్స్ వారు ఉచితముగా తమ హాస్పిటల్స్ ద్వారా వైద్య సేవలను అంధించిరి. వీరు మోకాలి నొప్పులు, నరాలకు సంబంధించిన వ్యాదులను పరీక్షించిరి. దేవస్తాన కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.గీత గారు ఈ మెడికల్ క్యాంపును ఉదయము గం.11-00లకు ప్రారంభించిరి.

          (సాంస్కృతిక కార్యక్రమములు తేది. 04-03-2017 నుండి తేది. 08-03-2017 వరకు)

          ధార్మిక సాహిత్య సంగీత మహాసభలలో భాగంగా తేది.04-03-2017 రోజున సాయంకాలము శ్రీమతి  శ్రీదేవిగారిచే భక్తి సంగీత కార్యక్రమము భక్త మనోరంజకముగా కొనసాగినది. వీరు అన్నమాచార్య కీర్తనలు ఆలపించిరి. అనంతరము శ్రీమతి పప్పు పద్మ ప్రసన్నకుమార్ గారిచే వీణగాన కచేరి, భక్తి సంగీత కచేరి నిర్వహించబదినది. వీరు అమృత వర్షిణి, హిందోళ, హంసానంది రాగములలొ అద్భుతమైన కీర్తనలను వీణాగానంలో వినిపించిరి. అనంతరం శ్రీమతి గాయత్రి ఖమ్మం వారిచే భక్తి సంగీత కార్యక్రమం భక్తి భరితముగా నిర్వహించిరి. వీరు అన్నమాచార్య కీర్తనలు ఆలపించిరి. అనంతరము శ్రీమతి విజయవల్లి భరద్వాజ్ బృందంచే తిల్లాన మొదలగు కార్యక్రమాలు జరిగాయి.

5-03-2017 (ఆదివారము) సాయంకాల కార్యక్రమములు

ధార్మిక, సాహిత్య, సంగీత మహా సభలు

బ్రహ్మోత్సవములలో భాగంగా తేదీ.05-03-2017 ఆదివారము రోజున శ్రీమతి జి.జానకి బృందం (శ్రీ గోవర్ధనం వెంకటారామానుజాచార్యుల కళాశాల) వారిచే భక్తి సంగీత కార్యక్రమము ఎంతో భక్తి భరితముగా నిర్వహింపబడినది. వీరు శ్రీ నృసింహ పరమైన కీర్తనలు ఆలపించి భక్తులను ఆనందింపజేసిరి. అనంతరము భక్తరామదాసు బృందం సంగీత సిస్టర్స్ వారిచే భక్తి సంగీత విభావరి నిర్వహింపబడినది. వీరు పలుకే బంగారమాయనే, తారకమంత్రం కోరిన అంటూ పలు భక్తరామదాసు రచించిన శ్రీరాముడి కీర్తనలు భక్తుల మద్య ఆలపించి భక్తులను ఆనందింపజేసిరి. పిదప చిII పల్లవిచే భక్తి సంగీత కార్యక్రమము నిర్వహింపబడినది. వీరు పలు అన్నమాచార్య కీర్తనలు పాడిరి. తదుపరి మంజులానాయుడు వారి బృందము వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన గావింపబడినది. తదుపరి నాగదుర్గా బృందం నల్లగొండ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహింపబడినది. వీరు దశావతారములు, భాహ్మాంజలి, తిల్లానా” మొదలగు అంశములపై నృత్య ప్రదర్శన భక్తుల మద్య నిర్వహించిరి. పిదప స్వాతి సోమనాథ్ గారి శిష్య బృందము వారిచే నృత్య ప్రదర్శన గావింపబడినది. వీరు సుప్రసిద్ధ నాట్యకారులైనందున వీరి శిష్య బృందము నృత్య ప్రదర్శన భక్తులకు ఆనందింపజేసినది. అనంతరము గడ్డం పాండు బృందాముచే చెంచులక్ష్మి అను చిందు యక్షగాన ప్రదర్శన నిర్వహించబడినది. వీరి ప్రదర్శనను చూసి భక్తులు ఆనందించిరి.

06-03-2017 (సోమవారము) కార్యక్రమములు

ఉదయం కార్యక్రమములు

ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు

ఈ రోజు ఉదయం గం.౭.౦౦ల నుండి గం.8.00ల వరకు శ్రీరామ భజన మండలి, మల్లాపురం వారిచే భజన కార్యక్రమము నిర్వహించబదినది. పిదప శ్రీ ఎస్.కేశవులు అండ్ బృందం హైద్రాబాద్ వారిచే భక్తి భజన కార్యక్రమము నిర్వహించబదినది. అనంతరము ఆస్థాన విద్వాంసులచే నాద కచేరి, ఆస్థాన వేదపండితులచే వైధిక ప్రార్ఠన నిర్వహించబదినది. తదుపరి డాII కందాడై శ్రీనివాసాచార్యులు, హైద్రాబాదు వారిచే ఆధ్యాత్మిక ప్రవచనము గావించబడినది. వీరు శరణాగత తత్త్వము గూర్చి వివరించిరి. సమన్వయ కర్తగా దరూరి రామానుజాచార్యుల వారు వ్యవహరించిరి. తదుపరి డాII ముదపాక బాలసుందరం భాగవతార్ వారిచే విరాటపర్వము (కీచక వథ) హరికథా గానము గావింపబడినది. వీరి కధాగానము భక్త మనోరంజకముగా కొనసాగినది. వీరికి నిలయ విద్వాంసులు, వాయిద్య సహకారములు అందించిరి.

ఉచిత వైద్య శిబిరము:- తేది.06-03-2017

ఈ రోజు సాయి సంజీవిని హాస్పిటల్స్ వారు భ్రహ్మోత్సవములకు విచ్చేయు భక్తులకు ఉచితముగా తమ వైద్యసేవలను అందించిరి. వీరు కాలేయము, జీర్ణకోశ వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు మొదలగు వ్యాధులకు భక్తులకు పరీక్షలు జరిపి చికిత్సను అందించిరి.

తేది. 06-03-2017 సోమవారము సాయంకాల కార్యక్రమములు:-

1 భక్తి సంగీతం శ్రీమతి ఎన్.జగదీశ్వరి బృందం వారిచే గం.5.00 నుండి గం.6.00ల వరకు
2 భక్తి సంగీతం తిరుమల మానసావీణ గం.6.00 నుండి గం.7.00ల వరకు
3 కూచిపూడి నృత్యం శ్రీమతి రంగమణి బృందం హైద్రాబాద్ వారిచే కొండ క్రింద జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలొ బస్ స్టాండ్ ఎదురుగా శ్రీ స్వామివారి కళ్యాణ వైభవోత్సవము ముందు. గం.7.00 నుండి గం.7.30ల వరకు
4 శ్రీ స్వామి వారి కళ్యాణ వైభవోత్సవము కొండ క్రింద జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలొ బస్ స్టాండ్ ఎదురుగా గం.8.00 నుండి గం.10.00ల వరకు

 

IMG-20170305-WA0030 IMG-20170305-WA0034 IMG-20170305-WA0035 IMG-20170305-WA0036 IMG-20170305-WA0037
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *