Top Bar Ad

Breaking News

శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు – అలరించిన భక్తి గాన కచేరి

శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు – అలరించిన భక్తి గాన కచేరి

శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో (NGRI.గేట్2, హబ్సిగూడ౼ఉప్పల్ రోడ్) ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

హనుమాన్ జయంతి పురష్కరించుకొని (NGRI.గేట్2, హబ్సిగూడ౼ఉప్పల్ రోడ్ సమీపంలో వున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవళంలో ఈ రోజు (గురువారం) అభయాంజనేయ స్వామి వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఉదయం స్వామి వారికి ఏకాదశ మన్యసూక్త అభిషేకము నిర్యహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక ఆకుపూజలు, అర్చనలు నిర్వహించారు. ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు.

మధ్యాన్నం ఆలయ యాజమాన్యం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.

ఈ సందర్భంగా సాయంత్రం ఆలయ యాజమాన్యం సహకారంతో నిర్వహించిన భక్తి గాన కచేరీలో ” జ్ఞాన దుర్గా మ్యూజిక్ అకాడమీ ” ఆధ్వర్యంలో శ్రీమతి నాగజ్యోతి వారి శిష్య బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తులను విశేషంగా అక్కటుకొన్నాయి.

ఈ భక్తిగాన కచేరీలో పలువురు చిన్నారులు పాడిన పలు భక్తి గీతాలు కూడా ఎంతో అక్కటుకొన్నాయి. చివరిగా బృందం పాడిన హనుమాన్ చాలీసా పఠనాన్ని భక్తులు కూడా ఆలపించారు. అనంతరం గాన బృందానికి ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేశారు.

ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు, వివిధర రకాల పండ్లతో అల్లిన దండలతో అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందచేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *