Top Bar Ad

Breaking News

శిల్పారామం: ఆకట్టుకున్న శ్రీమతి ప్రశాంతి హారతి (యు.ఎస్.ఎ పోర్ట్‌లాండ్) గారి కూచిపూడి నృత్యప్రదర్శన

శిల్పారామం: ఆకట్టుకున్న శ్రీమతి ప్రశాంతి హారతి (యు.ఎస్.ఎ పోర్ట్‌లాండ్) గారి కూచిపూడి నృత్యప్రదర్శన 

ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం కూచిపూడి నృత్యప్రదర్శన శ్రీమతి ప్రశాంతి హారతి (యు.ఎస్.ఎ పోర్ట్‌లాండ్) గారి ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ముఖ్య అతిథిగా డా. విశ్వనాథ్ గారు విచ్చేసి కళాకారులను ఆశీర్వదించారు.

యు.ఎస్.ఎ పోర్ట్‌లాండ్ లో అభినయ డాన్స్ అకాడమీని స్థాపించి ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. అక్కడి విద్యార్థులనే ఇక్కడికి తీసుకువచ్చి మన శిల్పారామంలో ప్రదర్శించారు. మొదటగా సరస్వతీ నమోస్తుతే, మహిషాసుర మర్దని, గోవర్ధన గిరిధారి, శివాష్టకం, హిరణ్మయి లక్ష్మీం సదా భజామి, హనుమాన్ చాలీసా, అష్టలక్ష్మి, థిల్లాన అంశాలను, ఆర్య ఆలురు, తన్య హారతి, శ్రీమతి ప్రశాంతి హారతి, రిత్విక, మహా చమ్మతి, సహా చమ్మతిలు నర్తించి ప్రేక్షకులను మెప్పించారు.

నాట్య గురువులు శ్రీ భవానీ శంకర్ గారు మరియు శ్రీమతి డా. అనురాధ జొన్నలగడ్డ గారు కళాకారులందరికీ సన్మాన పత్రాలు బహూకరించి ఆశీర్వదించారు.

<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *