Top Bar Ad

Breaking News

శిల్పారామం: ఆకట్టుకున్న బెంగళూరు కళాకారిణి కుమారి సంజనా ప్రసాద్, కళాకారుడు శ్రీ విన్సెంట్ పాల్ భరతనాట్య ప్రదర్శన

ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంపీ థియేటర్ లో భరతనాట్యం మరియు కూచిపూడి నాట్యాలు ఎంతగానో అలరించాయి.   

బెంగళూరు కళాకారిణి కుమారి సంజనా ప్రసాద్ గారు భరతనాట్య ప్రదర్శనలో గణేశ అలరిప్పు, కలైతూక్తి కీర్తన, శరణమైన జావళి, ఎప్పోవారువతో పదం, థిల్లాన అంశాలను ప్రదర్శించారు.

బెంగళూరు భరతనాట్య కళాకారుడు శ్రీ విన్సెంట్ పాల్ గారు తన ప్రదర్శనలో గణేశకృతి, రామోనామ బాబు, సాధించనే త్యాగరాజు పంచరత్న కీర్తన, జయదేవ అష్టపది, థిల్లాన అంశాలను ప్రదర్శించారు.

నిర్మల నృత్యనికేతన్ వారి శిష్యబృందముచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం  అలరించింది. సకల దేవతా స్థుతి, తాండవ నృత్యకరీ, వినరో భాగ్యము, పలుకే బంగారమాయె, అదిగో అల్లదిగో, ముద్దుగారె యశోద, పాహి రామ ప్రభో, శరణు శరణు సురేంద్ర సన్నుత, వేడుకుందామా మొదలైన అంశాలను శ్రీమతి నిర్మల విశ్వేశ్వర రావు, రామ బాబు, చరిష్మ, హిమజ, గాయత్రి మొదలైనవారు  ప్రదర్శించారు.

<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *