Top Bar Ad

Breaking News

విశాఖ: బ్లాక్‌ చైన్‌ పరిజ్ఞానంతో భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించవచ్చు – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

బ్లాక్‌ చైన్‌ పరిజ్ఞానంతో భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించవచ్చు –  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

విశాఖ అక్టోబర్ 9 : బ్లాక్‌ చైన్‌ పరిజ్ఞానంతో భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ బ్లాక్‌ చైన్‌ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ తొలి నుంచి తాను సాంకేతిక పరిజ్ఞానాన్ని గట్టిగా నమ్మానన్నారు. భవిష్యత్తంతా సాంకేతిక పరిజ్ఞానానిదేననడంలో ఏమాత్రం సందేహంలేదన్నారు. బ్లాక్‌చైన్‌, ఐవోటీ, సమాచార నిర్వహణ, బయోమెట్రిక్‌, సమాచార దృశ్యీకరణ .. ఇలా పేరేదైనా సాంకేతికతను తమ ప్రభుత్వం ఉపయోగించుకోవాలనుకుంటోందన్నారు. ప్రజలను సంతోషంగా ఉంచడం, పేదరికాన్ని నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు ఉత్తమ జీవన ప్రమాణాలు అందిస్తాననిస్పష్టంచేశారు.హ్యాకింగ్‌ ముప్పు నుంచి సమాచారాన్ని కాపాడటానికి ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుందన్నారు.

ప్రస్తుతం మనం నాలుగో పారిశ్రామిక విప్లవం వైపు అడుగులేస్తున్నామని, ఇది ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కాలమని, ఏ పనిచేయాలన్నా వాస్తవ కాలంలో చేయొచ్చని తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో భద్రత, నమ్మకం ముఖ్యమని తెలిపారు. బ్లాక్‌చైన్‌ పరిజ్ఞానంతో సమీప భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. అంతర్జాలం కనిపెట్టాక ప్రపంచమంతా కుగ్రామంగా మారిందన్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు 25 దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం వివిధ కంపెనీల సీఈవోలతో ముఖాముఖిలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. బ్లాక్‌ చైన్‌ నిపుణులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ సదస్సు నిర్వహించినట్టు చెప్పారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *