Top Bar Ad

Breaking News

విద్యుత్ ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి తీపి కబురు

విద్యుత్ ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి తీపి కబురు

విద్యుత్ సంస్థల్లో పని చేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. విద్యుత్ సంస్థల్లో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. విద్యుత్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది క్రమబద్దీకరణ దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో మొత్తం నాలుగు సంస్థల్లో కలిపి 20,903 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది లబ్ధి పొందనున్నారు. ట్రాన్స్‌కో -4,197, జెన్‌కో – 2,914, ఉత్తర డిస్కం – 4,333, దక్షిణ డిస్కం -9,459 సిబ్బంది క్రమబద్దీకరణ కానున్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది క్రమబద్దీకరణ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో.. లబ్ధి పొందే సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు రుణపడి ఉంటామని సిబ్బంది పేర్కొంటున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి జెన్‌కో ఎండీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *