Top Bar Ad

Breaking News

రామగుండం కమిషనరేట్ CAR హెడ్ క్వార్టర్స్ తో ఏర్పాటుచేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రేంజ్ డీ ఐ జి శ్రీ సి .రవివర్మ ఐ పి ఎస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛము ఉంచి నివాళులు అర్పించారు

రామగుండం కమిషనరేట్ CAR హెడ్ క్వార్టర్స్ తో ఏర్పాటుచేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన కరీంనగర్ రేంజ్ డీ ఐ జి శ్రీ సి .రవివర్మ ఐ పి ఎస్ పోలిస్ గౌరవందనం తీసుకుని అమరవీరుల స్థూపమువద్ద వద్ద కాగడాను వెలిగించి ,అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛము ఉంచి నివాళులు అర్పించారు.వారు మాట్లాడుచు 21 అక్టోబర్ 1959 లో 20 మంది జవాన్లు కలసి లడక్ ప్రాంతంలో హాట్ స్రింగ్ విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారి పై దాడి చేసి10 మందిని హతమార్చినది. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్-21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుండి ప్రారంభమైనది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అమరులైన పోలీసుల జీవితాలనే మనం మార్గదర్శకంగా, ఆదర్శంగా మలుచుకుంటు ప్రజాసేవకు, ప్రజల ధన,మాన‌, ప్రాణాల రక్షణకు పునరంకితం కావడం. ఉగ్రవాదం, తీవ్రవాదం‌,మతతత్వం వంటి విఛ్ఛిన్న కర శక్తులతో నేరాలకు గోరాలకు‌ పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడవలసి రావడంతో పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాగ ఎంతో ప్రమాదకరంగా పరిణమించింది. ఈ దశలో త్యాగాలకు భయపడకుండా వెనుకడుగు వేయకుండా రెట్టించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని సాధించాలి. పోలీసులు త్యాగం చేయని రోజు అంటు ఉండదు. సెలవులు, పండుగ దినాలు, అధిక గంటలు పని చేయవలసి రావడం, ఆరోగ్యన్ని సైతం నిర్లక్ష్యం చేసి, అవిశ్రాంతంగా పని చేయడం వంటివి కూడా త్యాగలే, పోలీసుల తప్పులు ప్రచారం అవుతున్నంతగా వారి త్యాగాలు ఆశించిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోవడం లేదు. త్యాగాలు చేసే వారికి ఇంకా గుర్తంచడం లేదు. ఆరోజు కోసం మనమంతా ఎదురుచూద్దాం. ఈ సంవత్సరంలో మన దేశంలో విధి నిర్వహణలో (383) వీరమరణం పోందిన వారందరికీ మనము అందరము శ్రద్దాంశాలి ఘటిస్తున్నాము. వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను సర్వస్వం లబింపచేయడం,అయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు అందించే నిజమైన నివాళి.

పోలీసులు చేస్తున్న అత్యున్నత త్యాగాలను సమాజం గుర్తుంచుకొనే విధంగా ప్రముఖ దిన పత్రికలలో ప్రకటనలు బ్యానర్లు.మరియు కమీషనరేట్ నందు, పోలీసు స్టేషన్ లలో ఓపెన్ హౌజ్ కా‌ర్యక్రమము, వ్యాసరచన పోటీలు, పేంటింగ్, 2,5.4 కే రన్ లు, రక్త దాన శిబిరాలు, కొవ్వొత్తి ర్యాలీలు, నిర్వహించడం వంటి కార్యక్రమాలు జరిగినవి. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు . అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జరిగిన పెయింటింగ్, వ్యాసరచన పోటీలలో గెలుపొందన ,పోలిస్ సిబండికి విద్యర్థని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. పోలీస్ మరియు లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరం లో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలిస్ శ్రీ విక్రమ్ జీత్ దుగ్గల్ గారు రక్త దానం చేశారు .అదేవిదంగా చెన్నూరు లో కొత్తగా ఏర్పాటు అయిన సి -58 BN సి బెటాలియన్ అసిస్టెంట్ కమెండెంట్ సునీల్ కుమార్ అధ్వర్యంలో తమసిబంది రక్తదానం చేశారు వారిని సిపి గారు అభినందించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *