Top Bar Ad

Breaking News

రహదారి భద్రత అంశంపై ఈ రోజు జరిగిన మంత్రివర్గ ఉప సంఘం రెండవ సమావేశం

రహదారి భద్రత అంశంపై ఈ రోజు జరిగిన మంత్రివర్గ ఉప సంఘం రెండవ సమావేశం

రహదారి భద్రత అంశంపై మంత్రివర్గ ఉప సంఘం రెండవ సమావేశం ఈ రోజు 16-4-2018 ఉదయం 11  గం|| లకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, మాదాపూర్ లో జరిగింది.

ఈ సమావేశం లో మంత్రులు  శ్రీ తుమ్మల నాగేశ్వర రావు (రహదార్లు  & భవనములు), శ్రీ కె.టీ.ఆర్ (మునిసిపల్ & ఐ.టి), శ్రీ మహేందర్ రెడ్డి(రవాణా), శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి (ఎండోమెంట్స్), గార్లు మరియు TR&B ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, శ్రీ మహేందర్ రెడ్డి రాష్ట డి.జి.పి, శ్రీ కృష్ణ ప్రసాద్ రైల్వే పోలీస్ డి.జి.పి,  శ్రీ ఐ.గణపతి రెడ్డి ఇంజనీర్-ఇన్ – చీఫ్ (R&B) NH, శ్రీ పి.రవీందర్ రావు ఇంజనీర్-ఇన్ – చీఫ్ (R&B) రహదారులు, శ్రీ కృష్ణ ప్రసాద్ NHAI, RO, రాష్ట రవాణా  శాఖ  కమీషనర్, జాయింట్ కమీషనర్ పోలీస్ ట్రాఫిక్, శ్రీ లక్ష్మణ రావు, ప్రొఫెసర్ JNTU హైదరాబాద్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

రహదారి భద్రతా అంశాల పై మంత్రి  వర్గ ఉప సంఘం సమావేశం లో కూలంకషంగా చర్చించారు.

  • మొదటి రహదారి భద్రత మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం లో నిర్ణయించినట్లుగా రహదారి భద్రత చర్యలను పరిశీలించేందుకు కేరళ వెళ్లిన బృందం వారు వారి రిపోర్టు సమావేశానికి అందించారు.
  • కేరళ ప్రభుత్వం రహదారి భద్రతకుతీసుకున్న  చర్యలను రహదారి భద్రత మంత్రి  వర్గ ఉప సంఘం సమావేశ సభ్యులకు వివరించిన ప్రత్యేక బృందం.
  • రహదారి భద్రత చట్టాన్ని అమలు చేస్తున్న కేరళ ప్రభుత్వం.
  • వాహన చోదనకు సిములేటర్స్ ను పెద్దఎత్తున ఉపయోగిస్తున్న కేరళ ప్రభుత్వ రవాణా శాఖ.
  • విధిగా రోడ్ సేఫ్టీ ఫండ్ (నిధి) ను ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం.

వాహన చోదకుల అవగాహనకు తగు కార్యా చరణ ఏర్పాటుకు తీసుకోవలసిన  చర్యలపై  సమావేశం  లో విపులంగా చర్చ
జరిగింది.

ప్రమాదాలు జరుగుతున్నా బ్లాకు స్పాట్స్ గుర్తించి నివారణ చర్యలు చేపట్టేవిధం గా ప్రణాళికలు ఉండాలని సూచించిన మంత్రి  వర్గ ఉప సంఘం చైర్మన్ & మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు.

పాఠశాల విద్యార్థులకు విధిగా రహదారి భద్రత, పాటించాల్సిన నియమాలను పాఠ్యాంశంగా భోదించే విధంగా చర్యలు ఉండాలని కోరిన మంత్రి తుమ్మల.

రహదారి ప్రమాదాల వలన ఏటా షుమారు 7000 మరణాలు సంభవిస్తున్నాయని, ఇది ఎంతో బాధాకరమని తెలిపిన మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు.

మంత్రి  వర్గ ఉప సంఘం తమ సూచనలను మరింత మెరుగు పరచి వచ్చే సమావేశాలలోపుగా తమ తుది రిపోర్ట్ ముఖ్యమంత్రికి సమర్పిస్తామని తెలిపిన మంత్రి శ్రీ తుమ్మల.

ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా అంశాలలో మన రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నదని అయితే ప్రపంచ సగటుతో పోలిస్తే మనం వెనుకబడి ఉన్నామని, ప్రమాదాల నివారణ విషయంలో మన రాష్ట్రం ఇంకా మెరుగైన స్థితికి చేరుకునేందుకు తీసుకోవలసిన చర్యలను అన్ని వర్గాలతో విపులంగా చర్చించి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పిస్తామని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

తమ తుది నివేదిక ఈ క్రింది విషయాలకు అనుగుణంగా ఉండేలా కార్యవర్గ సభ్యులకు తెలిపినట్లు వివరించిన మంత్రి  వర్గ ఉప సంఘం చైర్మన్ మరియు మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు.

  • ప్రభుత్వ డి.జి.పి స్తాయి అధికారి ఆధ్వర్యంలో ఇతర సంబంధిత శాఖ అధికారులతో కూడిన పూర్తిస్తాయి రోడ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం.
  • వచ్చే శాసన సభ సమావేశాల నాటికీ రహదారి భద్రతా చట్టాన్ని తెచ్చె విధంగా ప్రణాళికను ఖరారు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం.
  • అట్టి రోడ్ సేఫ్టీ అథారిటీ రహదారులు & భవనముల మంత్రిత్వ శాఖ కు అనుబంధంగా పనిచేసే విధంగా చట్టంలో వెసులుబాటు కల్పించేవిధంగా రూపకల్పన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *