Top Bar Ad

Breaking News

భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ: రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలు, అవతరణ ఫిల్మోత్సవం

“అవతరణ ఫిల్మోత్సవం”

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ 3 రోజుల సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలు, అలాగే “అవతరణ ఫిల్మోత్సవం” పేరిట మన తెలంగాణ భాష, సంస్కృతి, సాంప్రదాయ రీతులు, ఉద్యమ నేపథ్యం కలిగిన చిత్రాలు ప్రదర్శన చేయనున్నారు.

ఈరోజు అవతరణ ఫిల్మోత్సవంలో…

మైక్ టి‌వి తెలంగాణ పాట ప్రదర్శన జరిగింది.

ఈ పాటకు…

రచన                  –          కందికొండ,

సంగీతం               –          నందన్ బొబ్బిలి,

పాడినవారు          –          మంగ్లీ (సత్యవతి),

రాప్                   –          లిప్సిక,

దర్శకులు            –          దాము కోసనం.

రేలారే రేలారే… నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే… పడి లేచి నిలిచే… రణములో నా తెలంగాణ… లేచి నిలిచి గెలిచే… రణములో అంటూ పాడిన జానపద పాటలో, రాప్ తో కూడిన శాస్త్రీయ సంగీతమును తలపించే విధంగా మన తెలంగాణ భాష, సంస్కృతి, సాంప్రదాయ రీతులు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి సంపద ఇలా అన్నీ కలిపి 4 నిమిషాల పాటలో అద్భుతంగా రూపొందించారు.

ఇటీవలే 64వ చలన చిత్రోత్సవంలో ఉత్తమ తెలుగు చిత్రంగా అలాగే స్క్రీన్ ప్లే మరియు మాటలు ఈ రెండు విభాగాల్లో ఉత్తమ జాతీయ పురస్కారం పొందిన “పెళ్లి చూపులు” సినిమా ప్రదర్శన చేశారు. ఈ సినిమా ప్రస్తుత యువతరం ఆలోచనలు, కెరీర్ మీద వాళ్ళకున్న శ్రద్ద, పెళ్లి గురించి ఇప్పటి యువత ఎలా ఆలోచిస్తున్నారు అని, హీరో జీవితం నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా అత్యద్భుతంగా తెలంగాణ భాష, సంస్కృతి, సాంప్రదాయ రీతులతో రూపొందించిన కథా చిత్రమే పెళ్లి చూపులు.

రచన, దర్శకత్వం                –           తరుణ్ భాస్కర్ దాస్యం (వరంగల్)

నిర్మాత                           –           రాజ్ కందుకూరి, యష్ రాగినేని

సంగీతం                           –           వివేక్ సాగర్

హీరో, హీరోయిన్                 –           విజయ్ దేవరకొండ, రీతూ వర్మ

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మలు హీరో – హెరోయిన్ లుగా నటించగా, అలాగే అభయ్, మరియు ప్రియదర్శిని సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పెళ్ళిచూపులు సినిమా బృందం, మైక్ టి‌వి తెలంగాణ పాట బృందం, ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్, తదీతరులు పాల్గొన్నారు.

1 SFC - 2017 18814204_1520331651353076_3576671843405332704_n SFC 2017
<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *