Top Bar Ad

Breaking News

మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి: ఎస్.పి.సింగ్

మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి: ఎస్.పి.సింగ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలకు కేటయించిన లక్ష్యాలకనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ అన్నారు.తెలంగాణ కు హరితహారం కార్యక్రమంపై శనివారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు గారు  ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని, ప్రస్తుతం వర్షా కాల సీజన్ సందర్భంగా మొక్కలు నాటడాన్ని వేగవంతం చేయాలని , వ్యవసాయ శాఖ కు సంబంధించి అధికారులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి రైతులు పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ప్రోత్సహించాలని అన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా ఈత మరియు ఖర్జూర మొక్కలు నాటడాన్ని విస్తృతం చేయుటకు ఆ శాఖ అధికారులను మోటివేట్ చేయాలన్నారు. మున్సిపాలిటీలలో మొక్కల పెంపకానికి సంబంధించి ప్రత్యేక వ్యూహం వుండాలని , ప్రజలకు అహ్లాదకర వాతావరణం పెంపొందేలా పార్కులు, ల్యాండ్ స్కేపింగ్ , బరియల్ గ్రౌండ్స్ లో , రోడ్డు డివైడర్స్ లో మొక్కలు నాటాలన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ ను విస్తృతంగా చేపట్టాలన్నారు. ఎయిర్ పోర్ట్ నుండి నగరానికి వచ్చే రహదారిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. దీని కోసమై  మంచి మొక్కలను ఎంపిక చేయాలన్నారు.

జి.హెచ్.యం.సి తనకు కేటాయించిన లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటడానికి రెసిడెన్సియల్ అసోసియేషన్ లు , స్వచ్ఛంద సంస్థలు , సామాజిక సంస్థలను భాగస్వామ్యం చేయాలన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో వున్న ఫారెస్ట్ బ్లాక్ లలో విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలని జి.హెచ్.యం.సి కమీషనర్ కు సూచించారు. రోడ్డు భవనాల శాఖ ద్వారా రహదారుల వెంట మొక్కలు నాటడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నీటి పారుదల , పంచాయతీ రాజ్ , అటవీ లాంటి వివిధ శాఖల లక్ష్యాల మేరకు మొక్కలు నాటేలా కలెక్టర్లు ప్రత్యేకంగా సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణా రావు, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ,అండ్ బి శాఖ ముఖ్యకార్యదర్శిసునీల్ శర్మ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ , వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, జి.హెచ్.యం.సి కమీషనర్ బి.జనార్దన్ రెడ్డి, హెచ్.యం.డి.ఎ. కమీషనర్ చిరంజీవులు, ఎక్సైజ్ శాఖ కమీషనర్ చంద్రవదన్ , పి.సి.సి.ఎఫ్ పి.కె.ఝా తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *