Top Bar Ad

Breaking News

మహబూబ్ నగర్ జిల్లా హాస్పిటల్ లో 7 పడకల పాలియేటివ్ కేర్ యూనిట్ ని ప్రారభించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా హాస్పిటల్ లో 7 పడకల పాలియేటివ్ కేర్ యూనిట్ ని ప్రారభించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి

అనంతరం పాలియేటివ్ కేర్ లో చేరిన రోగులు, వారి బంధువులతో, డాక్టర్ల తో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి

మంత్రి లక్ష్మారెడ్డి:

ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పని చేస్తున్నది. పాలియేటివ్ కేర్ సెంటర్ కూడా మానవీయ కోణంలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వైద్యం. పాలియేటివ్ కేర్ క్యాన్స‌ర్ బాధితుల‌కు ఒక వ‌రం. చివ‌రి ద‌శ‌లో క్యాన్స‌ర్ రోగుల‌కు సేవ‌లు అందించ‌డం కుటుంబ సభ్యుల‌కు భారంగా మారుతుంది. బాధితుల బాధ‌లు కూడా వ‌ర్ణ‌ణాతీతంగా ఉంటాయి. అందుకే పాలియేటివ్ కేర్‌లో ఓపీ, ఐపీ సేవ‌ల‌తోపాటు, ఇంటింటికీ వెళ్ళి వైద్యం అందించే, మనో ధైర్యాన్ని పెంపొందించే సిబ్బంది ఉంటారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాలియేటివ్ కేర్ యూనిట్లు పెడతాం. చేవెళ్ళ త‌ర్వాత మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ లో మ‌రో కేంద్రం ఏర్పాట‌వ‌డం ఈ ప్రాంత క్యాన్స‌ర్ బాధితుల‌కు ఊర‌ట. పాలియేటివ్ సెంటర్లో అందుబాటులో అత్య‌వ‌స‌ర సేవ‌లు. పెరిగిన జీవ‌న వేగం, మారుతున్న ఆహార‌పు అల‌వాట్ల‌తోపాటు అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.  కిడ్నీ, లివ‌ర్‌, గుండె సంబంధ స‌మ‌స్య‌లు,  క్యాన్స‌ర్ లాంటి వ్యాధులు ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి వాళ్ళ అవ‌సాన ద‌శ అత్యంత దారుణంగా ఉంటున్న‌ది.  ఆఖ‌రి ద‌శ‌లో ఆయా స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వున్న వాళ్ళు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డే ప‌రిస్థితులు కూడా దాపురిస్తున్నాయి.  ఇలాంటి వాళ్ళ కోస‌మే తెలంగాణ ప్ర‌భుత్వం పాలియేటివ్ కేర్ యూనిట్ల‌ని ఏర్పాటు చేస్తున్న‌ది.

సీఎం కెసిఆర్ ఆలోచ‌న‌ల మేర‌కు పాలియేటివ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని క్యాన్స‌ర్ వ్యాధులు ప్రాణాంత‌కం కాక‌పోయిన‌ప్ప‌టికీ, రాష్ట్రంలో ర‌క‌ర‌కాల క్యాన్స‌ర్ వ్యాధుల‌ బారిన ప‌డుతున్న రోగుల సంఖ్య 6 ల‌క్ష‌లుగా న‌మోదైంది.  అందులో ల‌క్ష మంది వ‌ర‌కు రేడియేష‌న్ తీసుకుంటున్నారు.  ఇందులోనూ 20వేల మంది వ‌ర‌కు పాలియేటివ్ కేర్ అవ‌స‌ర‌మ‌వుతున్న వాళ్ళున్నారు. ఇలాంటి వాళ్ళ కోస‌మే ప్ర‌భుత్వం పాలియేటివ్ కేర్ యూనిట్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ది. పాలియేటివ్ కేర్ యూనిట్‌లో క్యాన్స‌ర్‌, అవ‌య‌వ సంబంధ స‌మ‌స్య‌ల అవ‌సాన ద‌శ‌లో అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల చికిత్స‌లు అందుబాటులో ఉంటాయి. యూనిట్‌లో ఓపీ, ఐపీ చికిత్స‌లు చేస్తారు.  పేషంట్ల ఇళ్ళ వ‌ద్ద‌కు వెళ్ళి వైద్య సేవ‌లు అందిస్తారు.  అందుకు అవ‌స‌ర‌మైన వాహ‌నాలు కూడా అందుబాటులో ఉంటాయి.  అలాగే కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. ఆయా వ్యాధుల తీవ్ర‌త‌ను అర్థం చేసి, ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా పేషంట్ల‌కు వివ‌రిస్తారు.  త‌ద్వారా వ్యాధుల మీద అవ‌గాహ‌న క‌లిగి, చైత‌న్యంతో రోగులు నిబ్బ‌రంగా, వీలైనంత సంతోషంగా ఉండే వాతావ‌ర‌ణాన్ని క‌ల్పిస్తారు. అవసాన దశలోనే కాదు. మరణాంతర సేవలను కూడా ప్రభుత్వ ప్రజలకు అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానాల్లో చనిపోతే, వారి మృత దేహాలను ఉచితంగా వారి ఇళ్లకు పార్థివ వాహనాల ద్వారా పంపిస్తున్నాం.

హైదరాబాద్ గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర జనాభాలో 10 శాతం దంపతులు సంతాన లేమి తో బాధ పడుతున్నారు. మహబూబ్ నగర్ దవాఖాన ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తున్నాం. మెడికల్ కాలేజీ తో జిల్లా ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందుతాయి.  వైద్య రంగాన్ని సీఎం గారి చొరవ, చలవతో అద్భుతంగా తీర్చి దిద్దుతున్నాం.

ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్:

సీఎం కేసీఆర్ దీవెనలు, మంత్రి లక్ష్మారెడ్డి చొరవతో రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ది చెందుతున్నది. అందులో మహబూబ్ నగర్ జిల్లా కూడా ముందు స్థానంలో ఉంది. జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చింది. జిల్లా హాస్పిటల్ అభివృద్ధి చెందుతున్న ది. తాజాగా పాలియేటివ్ కేర్ యూనిట్ రావడం ఈ జిల్లా వివిధ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు వరం.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పాల్గొన్న  మున్సిపల్ చైర్ పర్సన్ రాధ, స్థానిక ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ MNJ కాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత, RMO డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ అనిత, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాం కిషన్, అధికారులు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *