Top Bar Ad

Breaking News

బీమా కంపెనీలతో వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్. గారి సమీక్షా సమావేశం

బీమా కంపెనీలతో వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, ఐ.ఎ.ఎస్. గారి సమీక్షా సమావేశం

 

13 జూన్,  2018 న  తెలంగాణ  సచివాలయంలో డి. బ్లాక్ లోని సమావేశ మందిరంలో బీమా కంపెనీలతో వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి,  ఐ.ఎ.ఎస్.  గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన అనేక అంశాలపై చర్చ జరిగింది.  2017-18 ఖరీఫ్ మరియు రబీ కి సంబంధించి బీమా దరఖాస్తులను మరియు ప్రీమియం వివరాలను త్వరితగతిన పునఃపరిశీలించుకోవాలని బీమా కంపెనీలను ఆదేశించారు.  అలాగే బ్యాంకర్లని PMFBY Portal లో నమోదు చేసుకోవాలని సూచించారు.  పంటల బీమా Website లో పొందుపర్చిన సమీకృత వర్షపాత వివరాలను మాత్రమే పంట నష్ట పరిహారం అంచనాలు (Claim Computation)  వేయడానికి ఉపయోగించాలని తెలిపారు.   పాత కోడ్ కలిగిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల (Automatic Weather Station) నుండి వచ్చిన  వివరాలను మాత్రమే నష్ట పరిహార అంచనాలు వేయడానికి మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

భారత ప్రభుత్వం ఆదేశానుసారం, 10 సంవత్సరాల పంటల ఉత్పత్తి వివరాలను సత్వరమే అందజేయాలని డిఇఎస్ వారిని కోరారు.  అలాగే Threshold Yield ని కూడా బీమా కంపెనీల సహకారంతో తయారు చేయాలని సూచించారు.

ఖరీఫ్ మరియు రబీ 2017-18 కి సంబంధించిన బీమా క్లెయిము అమౌంట్ వివరాలను వెంటనే తెలియజేయాలని బీమా కంపెనీలను కోరారు.

2018-19 ఖరీఫ్ లో పంటల బీమా కార్యాచరణపై పలు సూచనలు చేసారు.  భారత ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రైతులను పంటల బీమా పరిధిలోకి తేవాలని… దాని కోసం అనేక ప్రచార మాద్యమాల ద్వారా రైతులకు పంటల బీమా గురించి తెలియచేయాలని సూచించారు.   అలాగే బీమా కంపెనీలు Toll Free నంబర్లను స్థానిక భాషలో ఏర్పాటు చేయాలని తద్వారా రైతులు తమ తమ సందేహాలను పరిష్కరించుకోవచ్చని అన్నారు.  Toll Free నంబర్లను సంబంధిత జిల్లాలలో ప్రతి రైతుకు తెలిసేలా ఏర్పాటు చేయాలని అన్నారు.  సాధారణ సేవా కేంద్రాలలో (Common Service Centres) పంట రుణ తీసుకోని రైతులు (Non-Loanee Farmers)  పంట బీమా దరఖాస్తు చేసుకునే వీలుందని తెలిపారు.

ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్.  వివిధ బీమా కంపెనీ ప్రతినిధులు, బ్యాంకర్లు, TSDPS అధికార్లు, DES అధికార్లు, రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *