Top Bar Ad

Breaking News

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఖాదర్ ఖాన్‌కన్నుమూత

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఖాదర్ ఖాన్‌కన్నుమూత

ముంబయి జనవరి 1: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఖాదర్ ఖాన్‌(81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖాదర్‌ ఖాన్‌ కెనడాలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సర్ఫరాజ్‌ వెల్లడించారు. కెనడాలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.అఫ్గానిస్థాన్‌లో జన్మించిన ఖాదర్‌ 1973లో వచ్చిన ‘ధాగ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. 250 చిత్రాలకు డైలాగులు రాశారు. ఖాదర్‌ మరణవార్త తెలిసి బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *