Top Bar Ad

Breaking News

ప్రొ. కొత్తపల్లి జయశంకర్ జయంతి కార్యక్రమం – తెలంగాణ కాలజ్ఞాని డాక్యుమెంటరీ ప్రదర్శన, పుస్తకావిష్కరణ

ప్రొ. కొత్తపల్లి జయశంకర్ జయంతి కార్యక్రమం – తెలంగాణ కాలజ్ఞాని డాక్యుమెంటరీ ప్రదర్శన, పుస్తకావిష్కరణ

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు దక్కన్ టాకీస్ సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొ. కొత్తపల్లి జయశంకర్ జయంతి కార్యక్రమం ఈరోజు  రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఘనంగా నిర్వహించారు.

సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాష్, రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ బిఎస్. రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, జి.హెచ్.ఎం.సి. డిప్యూటీ కమీషనర్ డా. తిప్పర్తి యాదయ్య, టీటా అద్యక్ష్యుడు సందీప్ కుమార్ మక్తాల తదితరులు పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలితో నివాళులు అర్పించారు.

అనంతరం, జయశంకర్ సార్ పై ‘చే’రన్ రూపొందించిన “తెలంగాణ కాలజ్ఞాని” డాక్యుమెంటరీ ప్రదర్శనతోపాటూ పుస్తకావిష్కరణ జరిగింది. జయశంకర్ సార్ అంటేనే తెలంగాణ ఉద్యమం అని అతిథులు వ్యాఖ్యానించారు. జయశంకర్ పై డాక్యుమెంటరీ రూపొందించిన చరణ్ ను అభినందిస్తూ సత్కరించిన  మామిడి హరికృష్ణ.

(courtesy: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *