Top Bar Ad

Breaking News

పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, డీఈఓలతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్

పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, డీఈఓలతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్

  

  • పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్
  • ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించాలి
  • దూరప్రాంతాల్లోని పరీక్షల కేంద్రాలకు బందోబస్తు ప్రత్యేకంగా కల్పించాలి
  • పరీక్షల ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలు పంపేటప్పుడు ఎస్కార్ట్ కల్పించాలి
  • వేసవి మొదలైన సందర్బంగా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్ వసతులుండాలి
  • రవాణాలో ఇబ్బందులు లేకుండా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసుకోవాలి
  • పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు అనుమతించవద్దు
  • వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

 

హైదరాబాద్, ఫిబ్రవరి 28 : పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పక్కాగా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సచివాలయంలో నేడు 31 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీ.ఈ.ఓలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారనే పేరొచ్చేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దూరప్రాంతాల్లో, ఏజన్సీ ఏరియాల్లో ఉన్న పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బందోబస్తు కల్పించాలన్నారు. ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలు పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లేటప్పుడు పోలీసు శాఖ అధికారులు ఎస్కార్ట్ కల్పించాలని కోరారు. వేసవి ఇప్పటికే మొదలైందని, కొత్తగూడెంలో 42 డిగ్రీల తీవ్రత ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్ వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులను సమయానికి ముందే పరీక్షా కేంద్రాల వద్ద ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

రవాణాకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఇక పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు అనుమతించవద్దని ఆదేశించారు. పరీక్షా సమయాల్లో పరీక్షా కేంద్రాలకు దగ్గరగా జీరాక్స్ సెంటర్లను మూసివేయించాలన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పరీక్షలకు సంబంధించిన ఏవైనా ఫోన్ కాల్స్ వస్తే వాటిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కిషన్, ఇన్ స్పెక్టర్ జనరల్  శిఖా గోయల్ కలెక్టర్లు, ఎస్పీలు, డీఈఓలకు సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో విద్యాశాఖ, పోలీస్, రవాణా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *