Top Bar Ad

Breaking News

పంచశీల ఒప్పందాలకనుగుణంగా భారత్‌తో కలిసి పనిచేస్తాం; మన బంధం సరైన మార్గంలో కొనసాగిద్దాం – చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 

పంచశీల ఒప్పందాలకనుగుణంగా భారత్‌తో కలిసి పనిచేస్తాం; మన బంధం సరైన మార్గంలో కొనసాగిద్దాం – చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 

బీజింగ్ సెప్టెంబర్ 5(ఎక్స్ ప్రెస్ న్యూస్): ‘పంచశీల ఒప్పందాలకనుగుణంగా భారత్‌తో పనిచేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నాం, ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తాం. చైనా-ఇండియా సంబంధాలు సరైన మార్గంలో ఉంచేందుకు ఎల్లప్పుడూ సహకరిస్తాం’ అని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. చైనా, భారత్‌ల మధ్య ఆరోగ్యకరమైన, స్థిరమైన సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. చైనాలోని షామన్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్రమోదీ, జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాధినేతలు దాదాపు 60 నిమిషాల పాటు ద్వైపాక్షిక అంశాల గురించి చర్చలు జరిపారు. సమావేశానంతరం జిన్‌పింగ్‌ మాట్లాడారు ఇరుదేశాధి నేతల సమావేశం గురించి విదేశాంగశాఖ కార్యదర్శి జైశంకర్‌ మీడియాతో మాట్లాడారు. సరిహద్దు భద్రత విషయంలో ఇరుదేశాల మధ్య పరస్పర అంగీకారం, సరిహద్దు సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకునేందుకు ఇరుదేశాధినేతలు అంగీకరించినట్లు విదేశాంగశాఖ కార్యదర్శి జైశంకర్‌ తెలిపారు. సరిహద్దులో శాంతి నెలకొనాలంటే ఇరుదేశాల మధ్య సహకారం ఎంతో అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.డోక్లాం వివాదం తలెత్తిన అనంతరం ఇరువురు నేతలు సమావేశం కావడం ఇదే ప్రథమం. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మయన్మార్‌ పర్యటనకు బయలుదేరారు. బ్రిక్స్‌ సదస్సు నిమిత్తం చైనా ప్రభుత్వం ఇచ్చిన అతిథ్యానికి గాను కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మయన్మార్‌ మంత్రి అంగ్‌ శాన్‌ సూచీని కలవనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *