నాలుగు కోట్ల మైలు రాయి దాటిన టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు
-
నాలుగు కోట్లు దాటిన టి-సాట్ యూట్యూబ్ వీవ్స్
-
హర్షం వ్యక్తం చేసిన సీఈవో శైలేష్ రెడ్డి
(టి.సాట్-సాఫ్ట్ నెట్)
టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు మరో మైలురాయి దాటాయి. టి-సాట్ ప్రసారాలకు యూట్యూట్ వీవ్స్ 4,00, 021,182లకు చేరుకున్నాయి.టి-సాట్ ప్రసారాలకు విస్తృత ఆదరణ లభించిదనడానికి ఇదో నిదర్శనం.నిరుద్యోగ యువత, విద్యార్థులు, ప్రభుత్వ శాఖలు,యువత, ప్రజల్లో వస్తున్న ఆదరణ టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల భాద్యత మరింత పెంచింది.
టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి గురువారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు నిపుణ, విద్య ద్వార చేస్తున్న శాటి లైట్ ప్రసారాలకు ఏర్పడిన ఆదరణ దృష్టిలో పెట్టుకుని టి-సాట్ సోషల్ మీడియా ఏర్పాటు చేశామన్నారు. గత రెండు సంవత్సరాలుగా టి-సాట్ యూట్యూట్, యాప్, పేస్ బుక్, ట్విట్టర్ ద్వార ప్రసారాలు జరగుతున్నాయని, తమ ప్రసారాలను తెలంగాణ నిరుద్యోగ యువత, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఇతర రంగాల ప్రజలు విస్తృతంగా ఆదరిస్తున్నారని సీఈవో సంతృప్తి వ్యక్తం చేశారు. వీవ్స్ తో పాటు సబ్ స్క్రైబ్స్ సుమారు మూడు లక్షలకు చేరుకోవడం ఛానళ్ల ప్రసారాల నాణ్యత, నవ్యతలకు అద్దం పడుతున్నాయన్నారు. టి-సాట్ యూట్యూబ్ కు 2018 సంవత్సరాంతానికి భారీ సంఖ్యలో వీవ్స్ పెరగడం ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని శైలైష్ రెడ్డి వివరించారు.
టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేస్తున్న విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలను వీక్షించేందుకు వెబ్ సైట్ SOFTNET.TELANGANA.GOV.IN, వీడియో వెబ్ సైట్ TSAT.TV, యాప్ TSAT APP, YOUTUBE/TSATNETWORK, FACEBOOK/TSATNETWORK, TWITTER/TSATNETWORK ద్వార ప్రసారాలను పొందవచ్చని సీఈవో సూచించారు.