Top Bar Ad

Breaking News

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ శాఖ అద్వర్యంలో ఘనంగా పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం 

ఘనంగా పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం

అక్టోబర్ 21: పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ శాఖ అద్వర్యంలో స్తానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా ఎస్.పి శ్రీ కల్మేశ్వర్ సింగేనవర్ ఐ.పి.ఎస్ గారి అద్వర్యంలో గౌరవ మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు పోలీస్ అమర వీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్తూపం వద్ద పూల మాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.ఈ కార్యక్రమానికి అచ్చంపేట్ ఎ.ఎల్.ఎ శ్రీ గువ్వల బాలరాజు గారు,జిల్లా కలెక్టర్ శ్రీ ఇ.శ్రీధర్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ సురేందర్ కరణ్ గారు, డి.అర్.ఓ శ్రీ మధుసూదన్ నాయక్ గారు, ముఖ్య ఆహ్వానితులుగా హాజరు అయ్యి నివాళులు అర్పించారు.విది నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమర వీరుల కుటుంబాల సభ్యులను కలుసుకొని తమ ప్రగాడ సానుభూతిని తెలియజేసి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అమరులైన పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విదాల అండగా నిలుస్తుందని తెలిపారు.విధి నిర్వహణలో పోలీస్ లు తమ వంతు కర్తవ్యాన్ని కలిగి ఉండాలని అన్నారు.అనంతరం పోలీస్ అమర వీరుల కుటుంబాల సభ్యులను శాఖ తరుపున జ్ఞాపికలను అందజేసారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి శ్రీమతి అనసూయ గారు,డి.ఎస్.పి శ్రీ సి ప్రవీణ్ కుమార్ గారు, జిల్లా లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ లు , మండలా ల ఎస్.ఐ లు స్టేషన్ ల సిబ్బందితో పాటు వివిధ పార్టీల ప్రజా ప్రతినిథులు , నేతలు కార్యకర్తలు వివిధ పాటశాలల విద్యార్థిని , విద్యార్థులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *