Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ: నిజమైన, సహజమైన, వాస్తవాలున్నసంఘటనలను సినిమాలుగా రూపొందిస్తే ప్రపంచ సినిమాలో తెలంగాణ సినిమాకు ఒక ప్రత్యేక స్థానముంటుంది – సినివారం కార్యక్రమంలో సాహితీవేత్త, చరిత్ర పరిశోధకుడు, ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ:

నిజమైన, సహజమైన, వాస్తవాలున్నసంఘటనలను సినిమాలుగా రూపొందిస్తే ప్రపంచ సినిమాలో తెలంగాణ సినిమాకు ఒక ప్రత్యేక స్థానముంటుంది – సినివారం కార్యక్రమంలో సాహితీవేత్త, చరిత్ర పరిశోధకుడు, ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్

ఈరోజు  “సినివారం”లో 3 షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శనతో పాటు టాక్ @ సినివారంలో అతిథిగా శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో రవీంద్రభారతి మొదటి అంతస్తులో ప్రతి శనివారం నిర్వహిస్తున్న “సినివారం”. సినివారం శీర్షికతో లఘుచిత్రాలు/డాక్యుమెంటరిలు/ఫీచర్ ఫిల్మ్స్ ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నాం.

ఈరోజు సినివారంలో… 3 లఘు చిత్రాల ప్రదర్శనలతో పాటు టాక్ @ సినివారంలో ,ముఖ్య అతిథిగాసాహితీవేత్త, చరిత్ర పరిశోధకుడు, ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్ గారు అతిథిగా పాల్గొని సినిమాకి తెలంగాణ కథలు ఎలా ఉపయోగపడతాయో, వాటి నేపథ్యం గూర్చి తెలిపారు.

తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ మొదలుకొని మన తెలంగాణ కథలు నిజంగా సహజంగా, వాస్తవాలకు అనుగుణంగా ఉంటాయని, ప్రస్తుతం ప్రపంచ సినిమాలో ఎక్కడ పేరు వచ్చిన సినిమా అయిన నిజమైన సంఘటనలు సంభందించినవే ఎక్కువగా ఉంటాయి. ఇటీవలే మన తెలంగాణ సినిమా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతంలో ప్రముఖంగా కొన్ని కథలను సహజమైనవి, వాస్తవాలని, నిజమైన సంఘటనలను సినిమాలుగా రూపొందిస్తే ప్రపంచ సినిమాలో తెలంగాణ సినిమాకు ఒక ప్రత్యేక స్థానముంటుందని తెలిపారు.

1)    శ్రీ చంద్రపాల్ రచనా దర్శకత్వంలో, సింగరేణి ప్రభుత్వ సంస్థ, గోదావరిఖని కమ్యూనికేషన్ సెల్ ఆద్వర్యంలో రూపొందిన “మార్గదర్శి” షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన చేశారు. ఈ సినిమాలో సింగరేణి సేవా సమితి అందించే శిక్షణల ద్వారా లబ్ది పొందుతున్న మార్గాలు, అలాగే ఈవ్ టీజింగ్ లేకుండా చూడాలి అనే ఇతివృత్తంతో గోదావరిఖనిలో నిజంగా జరిగిన సంఘటనను తీసుకొని రూపొందించిన దర్శకుడి తొలి సినిమా ఇది.

2)   శ్రీ సంతోష్ బాలరాజ్ రచనా దర్శకత్వంలో రూపొందిన “మల్లిగాడి ఊరి ప్రేమ కథ” లఘుచిత్రమ్ ప్రదర్శన జరిగింది. ఈ సినిమా “ముల్లుని ముల్లుతోనే తీయాలి.. ప్రేమని ప్రేమతోనే జయించాలి” అనే ఇతివృత్తంతో దర్శకులు రూపొందించారు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది ఈ చిత్రం.

3)   శ్రీ కండి రామచంద్రారెడ్డి దర్శకత్వంలో రూపొందిన “పునర్జన్మ” షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన చేశాము. పంటలు పండక అప్పుల బాధతో.. ఆత్మహత్యకు సిద్దపడ్డ రైతు జీవితంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ రైతుకు ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది.. రైతుకు, పల్లెకు పునర్జన్మ అంటూ ఈ చిత్రంలో అద్బుతంగా రూపొందించారు.

ఈ కార్యక్రమంలో సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత, నటీనటులు, అలాగే ఈ సినిమా సాంకేతిక నిపుణులు, వారి కుటుంబ సభ్యులు, సినివారం టీం అక్షర కుమార్, సంఘీర్, బత్తిని వినయ్ కుమార్, నరేష్ కుమార్ సూఫీ, MS విష్ణు, ఔత్సాహిక యువ ఫిల్మ్ మేకర్స్, సినీ ప్రేమికులు పలువురు పాల్గొన్నారు.

<
>

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *