Top Bar Ad

Breaking News

డబుల్ బెడ్ రూం ల‌బ్ధిదారుల ఎంపిక పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాలి: జూపల్లి కృష్ణారావు

డబుల్ బెడ్ రూం బ్ధిదారుల ఎంపిక పారర్శకంగా గాలి: జూపల్లి కృష్ణారావు     

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా డబుల్ బెడ్ రూం ల‌బ్ధిదారుల ఎంపిక జ‌ర‌పాల‌ని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సచివాలయంలో గ‌ద్వాల జిల్లాలో నిర్మించ‌నున్న‌ డబుల్ బెడ్ రూం ఇళ్లపై గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలోను మంజూరైన 14 వంద‌ల‌ ఇళ్ల నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని…ల‌బ్ధిదారుల ఎంపిక‌ను పార‌ద‌ర్శ‌కంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూమి లేని నిరుపేద‌ల‌కు, గుడిసెవాసుల‌కు తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు. గుడిసె వాసుల‌కు సంబంధించి 2014 లో సెర్ప్ చేసిన స‌ర్వే నివేదిక ఆధారంగా గ్రామాలు, ల‌బ్ధిదారుల ఎంపిక‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. డ‌బుల్‌ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం ఇంకా స్థలం గుర్తించని గ్రామాల‌పై అధికారులు దృష్టి పెట్టాలని…  టెండర్లు పిలిచి త్వ‌రిత‌గ‌తిన పనులు ఆరంభం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ భాస్క‌ర్‌, అలంపూర్‌ ఎమ్మెల్యే సంప‌త్‌, కలెక్టర్ ర‌జ‌త్ కుమార్ షైనీ త‌దిత‌రులు పాల్గొన్నారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వేగం చేసే దిశ‌లో భాగంగా గ‌త మూడు రోజులుగా నాగ‌ర్ క‌ర్నూల్‌, మహబూబ్ నగర్, గద్వాల జిల్లాల అధికారులు, ఎమ్మెల్యేల‌తో స‌మీక్ష‌లు జ‌రిపిన ఇంఛార్జీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు…వనపర్తి జిల్లా స‌మీక్ష‌ను శుక్ర‌వారం నిర్వ‌హించ‌నున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *