Top Bar Ad

Breaking News

టీటా CAN 2018 గ్రాండ్ సక్సెస్ – ముగిసిన టీటా అధ్య‌క్షుడు సందీప్‌కుమార్ మ‌క్తాల మూడు దేశాల ప‌ర్య‌ట‌న‌

టీటా CAN 2018 గ్రాండ్ సక్సెస్

– వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌
– కొత్త వేదిక‌తో విదేశాల్లోని టెకీల‌కు మ‌రింత చేరువ అయిన టీటా
– ముగిసిన టీటా అధ్య‌క్షుడు సందీప్‌కుమార్ మ‌క్తాల మూడు దేశాల ప‌ర్య‌ట‌న‌

కెన‌డా, జూలై 15, 2018:
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు టెకీల‌కు త‌మ అభిప్రాయాల‌ను పంచుకునే వేదిక‌ను అందించేందుకు ప్ర‌ణాళికబ‌ద్దంగా కృషిచేస్తున్న తెలంగాణ ఐటీ అసోసియేష‌న్ (టీటా) ఈ క్ర‌మంలో మ‌రో మైలురాయిని చేరుకుంది. కెన‌డాలో టీటా చాప్ట‌ర్‌ను టీటా వ్య‌వ‌స్థాప‌క‌ అధ్య‌క్షుడు సందీప్‌కుమార్ మ‌క్తాల ప్రారంభించారు. తొమ్మిది మందితో కూడిన కోర్ గ్రూప్ `టీటా CAN`ను స‌మ‌న్వ‌యం చేయ‌నుంది. నాలుగు ప్ర‌ధాన సెక్టార్ల‌లో కెన‌డాలోని ప్ర‌వాసుల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా ఉండేందుకు టీటా త‌న చాప్ట‌ర్‌ను ప్రారంభించింది. తెలంగాణ భూగ‌ర్భ‌ వ‌న‌రుల అభివృద్ధి చైర్మ‌న్ వి.ప్ర‌కాశ్, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్యకార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ ఈ సంద‌ర్భంగా టీటా కెన‌డా చాప్ట‌ర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. టీటా కెన‌డా చాప్ట‌ర్ ఏర్పాటు అనంత‌రం త‌న మూడు దేశాల ప‌ర్య‌ట‌న ముగించుకొని సందీప్‌కుమార్ మ‌క్తాల హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం అయ్యారు.

టీటా కెన‌డా చాప్ట‌ర్ ద్వారా విద్యార్థులు, అభ్య‌ర్థుల‌ను ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో ఉద్యోగ ల‌క్ష‌ణాల‌కు త‌గిన రీతిలో స‌న్న‌ద్ధం చేయ‌డం మొద‌టి ల‌క్ష్యం. ఇందుకోసం వారికి ప్ర‌త్యేక‌ సెష‌న్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఇక రెండో అంశం..ఇప్ప‌టికే ఉద్యోగంలో ఉన్న వారిని వారి నైపుణ్యం పెంచుకునేందుకు అప్ స్కిల్లింగ్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం. టీటా ప్రొఫెష‌న‌ల్స్ క‌నెక్ట్ పేరుతో ఏర్పాటుచేసిన మూడో కార్య‌క్ర‌మంలో భాగంగా వివిధ దేశాల్లోని ఉద్యోగులను అనుసంధానం చేయ‌డం. నాలుగ‌వ అంశంగా ఎంట‌ర్‌ప్రెన్యూర్‌ క‌నెక్టివిటీ నిర్వహించ‌నున్నారు. టీటాకు చెందిన ఇన్నోవేష‌న్ కేంద్రాలైన తెలంగాణ ఇన్నోవేష‌న్ ఆండ్ ఇంక్యుబేష‌న్ కేంద్రాల ద్వారా వారి ఆలోచ‌న‌ల‌ను వ్యాపార రూపంలో పెట్టే క‌నెక్ట్ క‌ల్పించ‌నుంది.

ఇలా నాలుగు విశిష్ట ల‌క్ష్యాల‌తో ఏర్పాటు అవుతున్న టీటా CAN 2018 ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. కెన‌డాలోని టోరంటోలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి 150 మంది ఐటీ నిపుణులు హాజ‌ర‌య్యారు. దీంతోపాటుగా టీటా చాప్ట‌ర్ ఏర్పాటుపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆస‌క్తి చూపారు. ట్రైనింగ్‌, జాబ్ స్కిల్లింగ్ సంబంధించిన అంశం కావ‌డంతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ భూగ‌ర్భ‌ వ‌న‌రుల అభివృద్ధి చైర్మ‌న్ వి.ప్ర‌కాశ్, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్యకార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ ఈ సంద‌ర్భంగా టీటా బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎన్నారైలు ముందుకు వ‌చ్చి ప‌ల్లె సీమ‌ల్లో డిజ‌ట‌ల్ విద్య‌కు స‌హాయం అందించాల‌ని కోరారు. కెన‌డాలో ఏయే అవ‌కాశాలున్నాయ‌నే దానిపై విద్యార్థుల‌కు ఈ సంద‌ర్భంగా నిపుణులు అవ‌గాహ‌న క‌ల్పించారు. టీటా కెన‌డా కోర్ గ్రూప్‌లో ఆదిత్య న‌ల్ల‌గొండ‌, క‌శి యాడారం, కృష్ణ‌కుమార్ కొమండ్ల‌, రాజేశ్ ఎడ్మ‌, రంజిత్ గ‌వ‌ల్ల‌, సాయిరామ‌కృష్ణ‌కంటే, స‌తీశ్‌రావు వీర‌వెల్లి, సంప‌త్ బాల‌మోని, శశాంక్ శ‌ర్మ మ‌డిప‌ల్లి ఉన్నారు.

ఇదిలాఉండ‌గా న్యాక్‌లో అడ్మిష‌న్ వ‌చ్చి ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా విద్యకు దూర‌మ‌య్యే ప‌రిస్థితులు ఎదుర్కున్న బాస‌ర విద్యార్థుల‌కు స‌హాయం చేసిన కెన‌డాలోని టీటా బృందానికి బాస‌ర ట్రిపుల్ ఐటీ కృత‌జ్ఞత‌లు తెలిపింది. త‌మ ట్రిపుల్ ఐటీ త‌ర‌ఫున కృత‌జ్ఞ‌తప‌త్రం అందించ‌డంతో పాటుగా బాస‌ర అమ్మ‌వారి బొట్టు, కుంకుమ,ప్ర‌సాదం అంద‌జేశారు. వీటితో పాటు ట్రిపుల్ ఐటీ ప్ర‌శంసా ప‌త్రాలు సందీప్‌కుమార్ మ‌క్తాల కెన‌డాలోకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు చేర‌వేశారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే స్పందించేలా కృషిచేసిన టీటా వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు సందీప్‌కుమార్ మ‌క్తాలను కెన‌డాలోని ఉద్యోగులు శాలువాతో స‌న్మానించారు.

కెన‌డా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్క‌డి విద్యావిధానాన్ని సందీప్‌కుమార్ మ‌క్తాల అధ్య‌య‌నం చేశారు. మెజార్టీ విద్యార్తులు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్నార‌ని వెల్ల‌డించారు. 9వ త‌ర‌గ‌తి నుంచే జాబ్ చేస్తూ ఉద్యోగానికి వెళ‌తారని, ఉద‌యం ఉద్యోగం, సాయంత్రం చ‌దువు ఉంటుంద‌ని వివ‌రించారు. సాయంత్రం 6 నుంచి క్లాస్‌లు స్టార్ట‌వుతాయని పేర్కొన్నారు. అమెరికా, మెక్సికో, కెనడా దేశాల ప‌ర్య‌ట‌న‌లో సందీప్‌కుమార్ మ‌క్తాల ప‌ర్య‌టించిన చివ‌రి దేశం కెన‌డా. అన్ని దేశాల పర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా యూనివ‌ర్సిటీలు, పాఠ‌శాల‌లు, విశ్వ‌విద్యాల‌యాల‌ను సంద‌ర్శించారు. ఈ అనుభ‌వాల‌ను క‌ల‌గ‌లిపి విద్యావిధానంపై ప్ర‌తిపాద‌న‌లు రూపొందించనున్నారు. గ‌త జూన్ నెల 27 నుంచి 16వ తేదీ 20 రోజుల పాటు సాగిన ఈ ప‌ర్య‌ట‌న‌లో గ‌మ‌నించిన‌ అనేక అంశాలు ఇందులో పొందుప‌ర్చ‌నున్నారు. టీటా గ్లోబ‌ల్ చాప్ట‌ర్ నుంచి ప్రజెంటేష‌న్ సిద్ధం చేస్తున్నామ‌ని, తెలంగాణ‌, కేంద్ర ప్ర‌భుత్వానికి ప్రజేంటేష‌న్ ఇవ్వ‌నున్నామ‌ని తెలిపారు.

కాగా, 20 రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అతి త‌క్కువ స‌మ‌యం ఆయ‌న హోట‌ల్‌లో బ‌స‌చేశారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హోట‌ల్ బ‌సకు ఏర్పాట్లు చేసుకోగా… హోట‌ల్‌ వ‌ద్ద‌ని తెలంగాణ నుంచి వ‌చ్చిన వ్య‌క్తి కాబ‌ట్టి త‌మ ఇంట్లో బ‌స చేయాల్సిందేన‌ని ఆత్మీయంగా త‌న‌కు స్వాగ‌తం ప‌లికిన వారంద‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌తలు తెలుపుతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా సందీప్ కుమార్ మ‌క్తాల తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *