Top Bar Ad

Breaking News

జాతీయ స్థాయిలో తెలంగాణ వ్యవసాయ శాఖకు అవార్డుల పంట – 52వ స్కాచ్ (SKOCH) సమ్మిట్ 

         జాతీయ స్థాయిలో తెలంగాణ వ్యవసాయ శాఖకు అవార్డుల పంట – 52వ స్కాచ్ (SKOCH) సమ్మిట్ 

తెలంగాణ రైతు బాంధవుడు, అపర భగీరథుడు, కృషీవలుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దూర దృష్టితో చేపట్టిన రు.16124.16 కోట్ల రుణ మాఫీ, కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఏడాదికి 25000 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రెతుబంధు,  రైతు బీమా, రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ పథకంతో 46000 చెరువుల పునరుద్ధరణ వంటి అనేక వినూత్న రైతు సంక్షేమ పథకాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.  అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతుబంధు పథకం అమలు చేస్తున్నదిఈ పథకంలో భాగంగా  తెలంగాణ రాష్ట్ర రైతులను అప్పుల బారిన పడకుండా సకాలంలో వ్యవసాయ చేసుకోవడానికి పెట్టుబడి సాయంగా ఏడాదికి ఎకరానికి రు. 8000 లు అందిస్తున్నది.  దీనికి గాను 12000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందిఈ పథకాన్ని  పారదర్శకంగా మరియు సమర్థవంతంగా అమలు చేయడానికి రైతుబంధు Web Portal ని NIC సౌజన్యంతో రూపొందించింది. 

ఈ రోజు న్యూ ఢిల్లీలో జరిగిన స్కాచ్ (SKOCH) 52వ సమ్మిట్  లో తెలంగాణ వ్యవసాయ శాఖకు 3 పురస్కారాలు దక్కాయి 

  1. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని రైతు సంక్షేమ పథకాలు, మన రాష్ట్రంలో అమలు చేస్తున్నందుకు గాను Telangana – State of the Year in Agriculture అనే అవార్డు, 

  1. రైతుబంధు పథకానికి గాను రెండు పురస్కారాలు దక్కాయి. అందులో ఒకటి అత్యున్నత స్థాయికి చెందిన ప్లాటినం అవార్డు, రెండవది Order of Merit అవార్డు. 

 ఈ పురస్కారాలు State of Governance అనే Theme కింద ఎంపిక కావటం గమనార్హం

 తెలంగాణ వ్యవసాయ ముఖ్య కార్యదర్శి శ్రీ పార్థసారథి, ..ఎస్గారు SKOCH CEO సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు.   

WhatsApp Image 2018-06-23 at 4.30.17 PM WhatsApp Image 2018-06-23 at 4.30.29 PM WhatsApp Image 2018-06-23 at 4.31.27 PM WhatsApp Image 2018-06-23 at 5.26.33 PM WhatsApp Image 2018-06-23 at 5.26.55 PM WhatsApp Image 2018-06-23 at 6.52.56 PM WhatsApp Image 2018-06-23 at 6.53.55 PM WhatsApp Image 2018-06-23 at 6.54.28 PM WhatsApp Image 2018-06-23 at 6.55.40 PM WhatsApp Image 2018-06-23 at 7.00.43 PM WhatsApp Image 2018-06-23 at 7.00.44 PM (1) WhatsApp Image 2018-06-23 at 7.00.44 PM
<
>

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *