Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

జర్నలిస్టులకు బంగారు తెలంగాణ – తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్

                       జర్నలిస్టులకు బంగారు తెలంగాణ                   – (వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్)

ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయం. అంతటా కోలాహలంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఆయనను అభినందించడానికి వెల్లువెత్తిన ప్రజా సమూహాలు. కొత్త క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ దాకా క్యూ కట్టిన జనం. దాని ముందరే జనహిత. ఇవ్వాళ్ల అధికారికంగా ప్రారంభం కానున్నది. ఇటు చివర పాత క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెట్టేసరికి ఒక ఉద్వేగం కమ్ముకున్నది.

దేశంలోనే పోరాట పటిమను ప్రదర్శించడంలో తెలంగాణ జర్నలిస్టులు నంబర్‌వన్. జర్నలిస్టులకు సంక్షేమ ఫలాలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం నంబర్ వన్. ముఖ్యమంత్రి నంబర్ వన్. నిజంగానే ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. జై తెలంగాణ. తెలంగాణ వస్తే ఏమొస్తుంది. ఏమొచ్చింది జర్నలిస్టు కుటుంబాలకు, జర్నలిస్టులకు ఒక నిశ్చింత, ఒక భరోసా వస్తుంది. వచ్చింది. జైజై తెలంగాణ.

లోపల అన్ని తెలంగాణ జిల్లాల నుంచీ వచ్చిన దరిదాపు వంద జర్నలిస్టు కుటుంబాల వారు. ప్రతీ వాళ్ల ముఖంలోనూ ఒక వేదన. దైన్యం. కానీ అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ భోజనాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన సబ్బండ వర్ణాల, జాతుల, వర్గాల ప్రజల పోరాటంలో పాల్గొన్న జర్నలిస్టు కుటుంబాలు ఇవ్వాళ్ల ముఖ్యమంత్రి కార్యాలయంలోకి రాగలగడమే తెలంగాణ రావడం. మరణించిన జర్నలిస్టు కుటుంబాల వాళ్లూ, అచేతనులై ఇక వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్నవాళ్లు, పిల్లలు, ముసలివాళ్లు వేదన గూడుకట్టుకుని ఉన్న దృశ్యం. ఇది రెండవసారి అనుభవం. అలనాడు నమస్తే తెలంగాణ తరఫున తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం సంక్షేమ నిధి జమ చేసి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇచ్చినప్పుడు కూడా ఇదే ఉద్వేగం. ఆ కుటుంబాల దుఖ్ఖాన్ని పంచుకున్న ఆ క్షణాలు. అప్పటి ఆవేదన వేరు. కానీ ఇప్పుడు సాధించుకున్న తెలంగాణలో జర్నలిస్టుల పెన్నిధిగా మారిన సం క్షేమ నిధి అందుకోవడానికి ముఖ్యమంత్రి పుట్టినరోజు నాడు జర్నలిస్టుల కుటుంబాలు తరలివచ్చిన దృశ్యం. ఆ కుటుంబాల దీనగాథలు అనేకం. ఎన్ని చెప్పినా తరగనివి. పుట్టినరోజు నాడు జనహిత ప్రారంభమయ్యిందే జర్నలిస్టుల సంక్షేమంతో. ఇంతకన్నా తెలంగాణ జర్నలిస్టులకు ఇంకా ఏం గౌరవం దక్కుతుంది. ఉద్యమంలో భుజంభుజం కలిపిన వారిని అక్కున చేర్చుకున్న ఈ కార్యక్రమమే తెలంగాణ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జర్నలిస్టుల పట్ల ఉన్న సానుకూలత, ప్రేమ, అభిమానానికి నిలువెత్తు నిదర్శనం. జర్నలిస్టుల పట్ల ఆ గౌరవమే ఇవ్వాళ్ల జనహితలో జర్నలిస్టుల కుటుంబాలు నిటారుగా నిలబడటం.

జనహితలో ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లక్షరూపాయల చెక్కులు అందుకున్న జర్నలిస్టుల భార్యాపిల్లలు, తల్లిదండ్రులు కేసీఆర్‌ను సల్లంగ బతుకాలె సార్ మీరు మా ఆయుష్షు పోసుకొని నూరేం డ్లు బతుకాలె అని దీవించిండ్రు. ఏ ముఖ్యమంత్రీ, ఏ జర్నలిస్టు కుటుంబానికి ఇంత బంధువు అయిన సందర్భమూ, కుటుంబాన్ని ఆదుకు న్న పెద్దన్న, పెద్ద కొడుకు అయిన సందర్భమూ బహుశా ఎక్కడా లేదనుకుం టా. దాదాపు అయిదు వందల మంది కష్టసుఖాలు విన్నారు కేసీఆర్. వాళ్ల పరిస్థితులేమిటో? వాళ్ల అవస్థలేమిటో? ప్రత్యక్షంగా చూసి జర్నలిస్టులు ఊపర్ షేర్వాణీ, అందర్ పరేషాణీ నిజమే. అక్కడికి వచ్చిన కుటుంబాలు ఒక్కటి కూడా తెల్లగపుల్లగ కనపడలేదు అన్నారాయన. అందుకే స్వయంగా పుట్టినరోజు అంతకన్నా పుణ్యకార్యం ఏముంటుంది అని కేసీఆర్ జర్నలిస్టుల నిధిని పంపిణీ చేశారు. 80 కుటుంబాల్లో వెలుగు నింపారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా ప్రెస్ అకాడమీకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ స్థానంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ఆయనే చొరవ చూపారు. ఆయన సూచించిన విధంగానే ప్రెస్ అకాడమీ ఇటు సంక్షేమం, అటు శిక్షణ రెండింటినీ నిర్వహించే సింగిల్ ఏజెన్సీ లాగా రూపుదిద్దుకుంటున్నది. ప్రెస్ అకాడమీలో తెలంగాణలోని ప్రసిద్ధ జర్నలిస్టులు, సంపాదకులు, యూనియన్ నాయకులతో జరిగిన సమావేశంలో స్వయంగా కేసీఆర్ అక్రెడిటేషన్ల పాలసీ, హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాల లాంటి విషయాలపై సుదీర్ఘ చర్చ జరిపారు. ఆయన సూచనల మేరకే సీనియర్ సంపాదకులు కె. రామచంద్రమూర్తి కమిటీ ఏర్పడి అక్రెడిటేషన్ల విధివిధానాలను రూపొందించింది. ఆ మేరకు కొన్ని సిఫార్సుల మార్పుచేర్పులతో సమాచార పౌర సంబంధాల శాఖ జీవో ద్వారా అక్రెడిటేషన్ల పాలసీ రూపుదిద్దుకున్నది. అంతకు ముందు ఉద్యమ సందర్భంలో జరిగిన జర్నలిస్టుల జాతరలో అప్పటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంగీకరించిన విధంగా డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్లు ఇవ్వడం బహుశా ఎక్కడా లేదు. ఒక్కో పత్రిక నుంచి రిపోర్టర్లకు ఇరవై అక్రెడిటేషన్లు ఉంటే అంతే సరిసమానంగా డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్లు కల్పించిన ఏకైన ప్రభు త్వం తెలంగాణ ప్రభుత్వమే.

ఇక హెల్త్‌కార్డుల విషయానికి వస్తే.. దేశంలో బహుశా ఎక్కడా లేనివిధంగా తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు జారీ అయ్యాయి. అంతకు ముందు హెల్త్‌కార్డులంటే బీమా ఆధారితంగా, జర్నలిస్టుల కంట్రిబ్యూషన్‌తో లక్షరూపాయల కవరేజీ పరిమితిలో ఒక హెల్త్‌కార్డు ఉండేది. అదీ అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు మారి లక్ష రూపాయల కవరేజీలో నలభై, యాభై వేలు మాత్రమే వర్తించేవి. అదే గొప్ప. కానీ తెలగాణ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైంది. ఒక్క పైసా కంట్రిబూషన్ లేకుండా, అపరిమితంగా కవరేజీ, ఆస్పత్రిలో ఎంత ఖర్చయితే అంత ఇచ్చే ఈ పథకం దేశంలో ఎక్కడా లేదు. క్యాష్‌లెస్‌తో పాటు, కుటుంబాన్ని కూడా విస్తృతపరిచి జర్నలిస్టు కుటుంబంలోని తల్లీతండ్రీ, పిల్లలను కూడా కలిపి ఈ హెల్త్‌కార్డు వర్తిస్తుంది. గతం లో ఈ పథకం సాధ్యం కాదని మొరాయించిన కార్పొరేట్ ఆస్పత్రులు, ఇప్పుడు ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత జర్నలిస్టుల కుటుంబాలకు ఈ హెల్త్‌కార్డు ఒక ఆరోగ్యదీపం అవుతున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, సరూర్‌నగర్‌లలో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి, వాటిద్వారా ఈ హెల్త్‌కార్డుల అమలు జరుగుతున్నది. వెల్‌నెస్ సెంటర్లలో అన్ని పరీక్షలు, మందులు, వ్యాధుల నిర్ధారణ లాంటివి చాలా ఉపయోగపడ్తున్నాయి.

అన్నింటికి మించి ప్రెస్ అకాడమీలో నిర్ణయించిన మేరకు జర్నలిస్టుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్ అదీ వందకోట్లతో ఏర్పాటు చేయాలని పెద్దమనసుతో ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపాదించారు. అది అమలులోకి రావడమే ఒక కీలకమైన సంక్షేమ దారి అయింది. ప్రతి యేటా పదికోట్ల రూపాయల చొప్పున అయిదేండ్ల పాటు 50 కోట్ల రూపాయాలు ఇస్తామని ప్రకటించిన సీఎం తొలి రెండేండ్ల బడ్జెట్‌లలో ఇరవై కోట్లు ఇప్పటికే ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలోని జర్నలిస్టు సంక్షేమ నిధికి జమ చేయించారు. ఆ పథకమే జనహితలో జరిగిన అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. మరణించిన వారి కుటుంబాలను స్వయంగా నేను చూశాను. ఎవరికీ ఒక ఇల్లు లేదు. ఎవరికీ ఒక భరోసా లేదు. చాలా కుటుంబాలను టీయూడబ్ల్యూజే నాయకుల ఆధ్వర్యంలో స్వయంగా చూసినప్పుడు వాళ్ల బ్రతుకులు ఎంత అధ్వాన్నస్థితిలో ఉన్నాయో స్వయంగా చూశాను. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఆ పరేషాన్ జీవితాలలో వెలుగు నింపిందే సంక్షేమ నిధి-జర్నలిస్టుల పెన్నిధి. ఒక కుటుంబానికి ఒక లక్ష, అయిదేండ్ల పాటు నెలకు మూడువేల లెక్కల పెన్షన్ చదువుకుకే పిల్లలుంటే పదవ తరగతి దాకా నెలకు, ఇద్దరికి వెయ్యి రూపాయల వంతున ఈ నిధి సహాయం చేస్తుంది. అట్లాగే ఇక వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు ఏక మొత్తంగా ఒకేసారి 50 వేల రూపాయ లు ఈ నిధి నుంచి సాయం అందుతుంది. ఒక సవాల్. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడైనా ఉందా! అంతేకాదు. ఈ నిధి సహాయం పంపిణీ సమయంలో సీఎం ఉద్వేగంగా ఇట్లాంటి నిధి ఇట్లా సద్వినియోగం అవుతున్నందున మరో 30 కోట్లు ప్రకటించి నిన్నటి బడ్జెట్‌లో ఆచరణలో అమలు చేశా రు.

అంటే అయిదేండ్లలో 50 కోట్ల రూపాయల నిధి బదులుగా, మూడేండ్లలోనే దాదాపు 60 కోట్ల రూపాయలు జర్నలిస్టుల సంక్షేమ నిధికి జమ అయ్యాయి. కేసీఆర్ పుట్టినరోజున ఇచ్చిన హామీ మేరకు మరణించిన జర్నలిస్టుల కుటుంబాల్లో ఆడపిల్ల పెండ్లికి 3 లక్షలు ఇస్తానన్న హామీని మూడు రోజులకే నెరవేర్చారు. పెద్దపల్లిలో మద్దిరాల నారాయణమూర్తి కూతురు వివాహానికి మూడు లక్షలు అందజేశారు. జర్నలిస్టుల సమస్యల మీద సన్నాయి నొక్కులు నొక్కే ఎవరికైనా సరే! ఒక సవాల్. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా జర్నలిస్టుకు ఒక నిధి ఇంత భారీ మొత్తంలో 60 కోట్లు కేటాయించారా? ఎక్కడాలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇం త ఆదరణ ఉన్నది. జర్నలిస్టులకు ఇది బంగారు తెలంగాణే. యూనియన్లు అనేకం ఉం డవచ్చు. రాజకీయాలు కూడా అనేకం ఉండవచ్చు. కానీ అన్నిరకాల కుటుంబాల ఆరోగ్యాన్ని రక్షించే హెల్త్‌కార్డులు, కుటుంబాలకు భరో సా ఇచ్చే నిధి. భవిష్యత్‌లో 60 కోట్ల నిధిలో జర్నలిస్టులకు ఒక పెన్షన్ పథ కం లాంటివి వచ్చిన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ప్రభుత్వా న్ని పల్లెత్తి చిన్నమాట అన్నా అది అన్యాయమే. ఇది ఏ ఒక్కరి వల్లా జరుగుతున్నది కాదు. జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో కలం కవాతు చేశారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ వేదికగా ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఇద్దరు జర్నలిస్టులు మిర్యాల్‌కార్ సునీల్ కుమార్, రాములు అమరులయ్యారు. వాటి ఫలితమే ఇవ్వాల్టి సం క్షేమం. సీఎం కేసీఆర్ పెద్దమనసు ఇవ్వాల్టి విజయానికి మూల కారణం.

ఇళ్ల స్థలాల సమస్యపై కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు. అదీ పరిష్కారం అవుతుంది. నిజమే మనకు భిన్నాభిప్రాయాలు అనేకం ఉండవచ్చు కానీ, సత్యమేమిటంటే తెలంగాణలో జర్నలిస్టులకు అమలవుతున్న పథకాలు నభూతో న భవిష్యతి. దేశంలోనే పోరాట పటిమను ప్రదర్శించడంలో తెలంగాణ జర్నలిస్టులు నంబర్‌వన్. జర్నలిస్టులకు సంక్షేమ ఫలాలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం నంబర్ వన్. ముఖ్యమంత్రి నంబర్ వన్. నిజంగానే ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. జై తెలంగాణ. తెలంగాణ వస్తే ఏమొస్తుంది. ఏమొచ్చింది జర్నలిస్టు కుటుంబాలకు, జర్నలిస్టులకు ఒక నిశ్చింత, ఒక భరోసా వస్తుంది. వచ్చిం ది. జైజై తెలంగాణ.

(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *