Top Bar Ad

Breaking News

కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చుతాం – విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చుతాం – విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

  • తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా కోఠి ఉమెన్స్ కాలేజీ
  • సిఎం కేసిఆర్ ఆమోదంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
  • విశ్వవిద్యాలయంగా మార్చడానికి కోఠి ఉమెన్స్ కాలేజీకి అన్ని వసతులున్నాయి
  • విశ్వవిద్యాలయంగా మార్చేందుకు నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 22 : కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని వసతులున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చుతామని చెప్పారు. నేడు ఆయన  కోఠి ఉమెన్స్ కాలేజీలో ఉన్న వసతులు పరిశీలించారు. బోధనా తీరుపై, విద్యావిధానంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉమెన్స్ కాలేజీ పరిసరాలను, భవనాలను తిరిగి చూశారు. హైదరాబాద్ నడిబొడ్డున 40 ఎకరాల్లో విస్తరించిన ఈ కాలేజీలో బోధనావసతులు బాగున్నాయని, కాలేజీ వాతావరణం విద్యార్థులకు అనుగుణంగా ఉందని కాలేజీలో మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కాలేజీలో రాష్ట్రంలోని 31 జిల్లాల విద్యార్థులున్నారని, వీరితో పాటు విదేశాలకు చెందిన చాలా మంది విద్యార్థినిలు కూడా చదువుతున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *