Top Bar Ad

Breaking News

*** 24x7onlinenews.com(30-May): Union Ministry of Home Affairs (MHA) issued New Guidelines to fight COVID-19 to be effective from 1st June 2020 ***

కేబీఆర్ పార్క్ వద్ద మన కూరగాయలు ప్రారంభోత్సవంలో మంత్రులు నాయిని, హరీశ్‌రావు

రైతులకు గిట్టుబాటు ధర..

-వినియోగదారులకు మేలే లక్ష్యం
-కేబీఆర్ పార్క్ వద్ద మన కూరగాయలు ప్రారంభోత్సవంలో మంత్రులు నాయిని, హరీశ్‌రావు

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు వినియోగదారులకు మేలు చేయడానికే మన కూరగాయలు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌వద్ద ఏర్పాటు చేసిన మన కూరగాయలు 46వ కేంద్రాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మన కూరగాయల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కూరగాయలను రైతుల వద్ద సేకరించి 12 గంటల్లోనే ఇక్కడికి చేరుస్తున్నామన్నారు.

కేవలం ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు మాత్రమే అదనంగా వసూలు చేస్తూ లాభాపేక్ష లేకుండా విక్రయిస్తున్నామన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నగరంలో 100 కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ వాకర్లు తాజా కూరగాయలను కొనుగోలు చేసేలా కేబీఆర్ పార్క్‌వద్ద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో నగరంలో 100కేంద్రాల ఏర్పాటుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎటువంటి కల్తీ లేకుండా మంచి కూరగాయలను వినియోగదారులకు సరఫరా చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో వాకర్లుపాల్గొన్నారు

<
>

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *