Top Bar Ad

Breaking News

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు తొలి బంగారు పతకం

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు తొలి బంగారు పతకం

గోల్డ్‌కోస్ట్(ఆస్ట్రేలియా): ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఆరంభం అదిరింది. క్రీడలు ప్రారంభమైన తొలి రోజే మహిళల 48కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్లో భారత అమ్మాయి సాయిఖోమ్ మీరాభాయ్ చాను స్వర్ణం గెలుచుకుంది. భారత తరఫున 2018 క్రీడల్లో పాల్గొని తొలి స్వర్ణం నెగ్గిన అమ్మాయిగా రికార్డు సృష్టించింది. అద్భుత ప్రదర్శన చేసిన చానుకు దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
23ఏళ్ల చాను భారత రైల్వేలో సీనియర్ టికెట్ చెకర్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో198 కేజీలను ఎత్తి జాతీయ రికార్డును నెలకొల్పి స్వర్ణం గెలుచుకొని కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించింది. 22ఏళ్ల అనంతరం కరణం మల్లీశ్వరీ తరువాత ఈ ఘనత సాధించిన రెండో భారత అమ్మాయి చానునే కావడం విశేషం. అంత‌కుముందు పురుషుల56 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గురురాజా రజతం సొంతం చేసుకున్నాడు. భార‌త్‌కు తొలి ప‌త‌కం సాధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *